Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: మా విజయానికి కారణం అదే: శుభ్‌మన్ గిల్

ప్రణాళికలకు తగ్గట్లు బ్యాటింగ్ చేయడంతోనే 406 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించగలిగామని టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. తొలి 25 ఓవర్లలోనే 200 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, కానీ 250 పరుగులు చేయడంతో తమ విజయం సులువైందని అభిప్రాయపడ్డాడు.

IND vs WI: ఆ ఒక్క తప్పిదమే మా ఓటమిని శాసించింది: వెస్టిండీస్ కెప్టెన్

IND vs WI: ఆ ఒక్క తప్పిదమే మా ఓటమిని శాసించింది: వెస్టిండీస్ కెప్టెన్

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గౌహతి వేదికగా బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. 406 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 43.3 ఓవర్లలోనే ఛేదించింది. 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 407 పరుగులు చేసి 39 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. శుభ్‌మన్ గిల్(130 బంతుల్లో 25 ఫోర్లు, 8 సిక్స్‌లతో 217 నాటౌట్) అజేయ డబుల్ సెంచరీతో సత్తా చాటగా.. రోహిత్ శర్మ(75 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101) సెంచరీతో కదం తొక్కాడు.

Shubman Gill Reveals How India Can Pull Off a Record 406-Run Chase Against West Indies

ఒళ్లంతా నొప్పులే..

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శుభ్‌మన్ గిల్ తమ విజయాని గల కారణాలను వెల్లడించాడు. పవర్ ప్లేలో అదిరిపోయే ఆరంభం దక్కడంతో పాటు వికెట్లు కోల్పోకపోవడం విజయానికి కలిసొచ్చిందని తెలిపాడు. అంతేకాకుండా వెస్టిండీస్ లక్ష్యాన్ని 30-40 పరుగులకు తగ్గించడం కూడా తమ గెలుపునకు కారణమైందని అభిప్రాయపడ్డాడు.

'నా ఒళ్లంతా నొప్పులే ఉన్నాయి. తీవ్రమైన ఎండలో ఆడటం వల్ల శరీరం మొత్తం క్రాంప్స్ వచ్చాయి. విండీస్ విధ్వంసంతో 13 ఓవర్ల ఫీల్డింగ్‌కే 20-25 ఓవర్లు ఆడేసినట్లు అనిపించింది. ఏదేమైనా మ్యాచ్ మాత్రం అద్భుతంగా సాగింది. విండీస్ 400+ లక్షాన్ని నిర్దేశించడంతో మాపై ఒత్తిడి పెరిగింది.

400 టార్గెట్ అంత ఈజీ కాదు..

వికెట్ ఎంత బాగున్నా.. మైదానం ఎంత చిన్నదైనా సరే... 400 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయడం అంత ఈజీ కాదు. ఈ పెర్ఫార్మెన్స్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి నేను ఆటను చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకుంటాను.

ముందుగా పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 75-80 పరుగులు చేయాలనుకున్నాం. కొత్త బంతితో ఆరంభంలో కాస్త స్వింగ్ అయింది. బంతి పాతబడే కొద్దీ వికెట్ బ్యాటింగ్‌కు మరింత అనుకూలంగా మారింది. అలాగే అలాగే మైదానంలో ఒకవైపు బౌండరీ చాలా చిన్నదిగా ఉంది. దాంతో పేసర్లు వచ్చినప్పుడు ఆ వైపు టార్గెట్ చేయాలని ప్లాన్ చేశాం.

IND vs SL: టాస్ ఓడిన భారత్.. బరిలో వైభవ్ సూర్యవంశీ!

Also Read

IND vs SL: టాస్ ఓడిన భారత్.. బరిలో వైభవ్ సూర్యవంశీ!

ఆఖరి వన్డేకు మార్పులు చేస్తాం..

ఇక 25 ఓవర్ల సమయానికి 200-210 పరుగులు సాధిస్తే మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చని భావించాం. కానీ మేం అప్పటికే 230-240 పరుగులు చేశాం. వాస్తవానికి పవర్ ప్లే ముగియగానే మాపై ఉన్న ఒత్తిడి మొత్తం పోయింది. సగం ఇన్నింగ్స్ వరకు మేం వికెట్లేమీ కోల్పోకపోవడం మాకు బాగా కలసివచ్చింది.

తొలి మ్యాచ్ తరహాలోనే ఈ మ్యాచ్‌లో కూడా పవర్ ప్లేలో మేం సరిగ్గా బౌలింగ్ చేయలేదు. దాంతో వాళ్లు చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఒక దశలో వాళ్లు 420-430 పరుగులు చేస్తారేమో అనిపించింది. కానీ చివరి ఓవర్లలో పుంజుకుని ఒక 25-30 పరుగులు తగ్గించగలగడం మాకు ప్లస్ పాయింట్ అయింది. సిరీస్ గెలిచాం కాబట్టి ఆఖరి వన్డేలో బెంచ్‌ ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తాం.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, October 1, 2026, 11:41 [IST]
Other articles published on Oct 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+