IND vs WI: కొంపముంచిన అన్షుల్ కంబోజ్.. వెస్టిండీస్ చేతిలో భారత్ ఓటమి!
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ఓటమితో ముగించింది. శనివారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. కెప్టెన్ షైహోప్(143 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో 162 నాటౌట్) అజేయశతకంతో భారత్ పతనాన్ని శాసించాడు. అరంగేట్ర పేసర్ అన్షుల్ కాంబోజ్(0/82) చెత్త బౌలింగ్ భారత్ విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ మ్యాచ్‌లో ఓడినా భారత్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.
పాపం రాహుల్...
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 351 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(85 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 92) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. కేఎల్ రాహుల్(87 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 129 నాటౌట్) అజేయ శతకంతో కదం తొక్కగా.. రోహిత్ శర్మ(85 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 92) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.
రుతురాజ్ గైక్వాడ్(69 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. నమన్ ధీర్(21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) పర్వాలేదనిపించాడు. వెస్టిండీస్ బౌలర్లలో జైడెన్ సీల్స్(3/62) మూడు వికెట్లు తీయగా.. కీమో పాల్(2/71) రెండు వికెట్లు పడగొట్టాడు. గుడకేష్ మోతీ ఒక వికెట్ తీసాడు.

అనంతరం వెస్టిండీస్ 48.2 ఓవర్లలో 5 వికెట్లకు 352 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ షైహోప్‌తో పాటు అమీర్ జంగూ(56 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 67) హాఫ్ సెంచరీతో రాణించాడు. కీమో పాల్(35 బంతుల్లో 5 ఫోర్లతో 44), గుడకేష్ మోతీ(19 నాటౌట్) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్, నమన్ ధీర్ తలో వికెట్ తీసారు.
చెలరేగిన షై హోప్, జంగూ..
352 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో విండీస్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర జాన్ క్యాంబెల్(10) తీవ్రంగా నిరాశపర్చాడు. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో అమీర్ జంగూతో కలిసి షై హోప్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. పవర్ ప్లేలో 78 పరుగులు చేసిన వెస్టిండీస్.. 14.2 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్‌ను అందుకుంది. షైహోప్ 46 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా.. జంగూ 47 బంతుల్లో అర్థ శతకం సాధించాడు.
నిలకడగా ఆడిన ఈ జోడీ అనవసర పరుగుకు ప్రయత్నించి మూల్యం చెల్లించుకుంది. విరాట్ కోహ్లీ అద్భుత ఫీల్డింగ్‌తో అమీర్ జంగూ రనౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 109 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. షెర్ఫెన్ రూథర్ ఫోర్డ్(24) నిదానంగా ఆడగా.. షైహోప్ 104 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే రూథర్ ఫోర్డ్.. నమన్ ధీర్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.
కీమో పాల్‌తో కలిసి షైహోప్ పోరాడాడు. కీమో పాల్ కూడా అతనికి సహకరించాడు. హాఫ్ సెంచరీకి చేరువైన అతన్ని గుర్నూర్ బ్రార్ పెవిలియన్ చేర్చాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 65పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మాథ్యూ ఫోర్డ్(7) నిరాశపర్చగా.. గుడకేష్ మోతీ(19 నాటౌట్) కలిసి షై హోప్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
కొంపముంచిన అన్షుల్ కాంబోజ్..
48వ ఓవర్‌లో అన్షుల్ కాంబోజ్ 22 పరుగులు ఇవ్వడం భారత్ విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ ఓవర్‌కు ముందు వరకు భారత్ గెలుపు రేసులో ఉంది. వెస్టిండీస్ విజయానికి చివరి 18 బంతుల్లో 29 పరుగులు అవసరమయ్యాయి. కానీ అన్షుల్ కాంబోజ్ వేసిన 48వ ఓవర్‌లో వరుసగా 5nb, 4, 1, 4, 6లతో 22 పరుగులిచ్చుకొని మ్యాచ్‌న వెస్టిండీస్ వశం చేశాడు. ఈ ఓవర్ కాస్త కట్టుదిట్టంగా వేసి ఉంటే.. వెస్టిండీస్ బ్యాటర్లే ఒత్తిడికి గురై వికెట్ పారేసుకునేవారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


