రఫ్ఫాడించిన నమన్ ధీర్, కుల్దీప్, అక్షర్ .. కుప్పకూలిన వెస్టిండీస్!
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 171 పరుగులకు కుప్పకూలింది.
కెప్టెన్ షై హోప్(37 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52), షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(34 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో నమన్ ధీర్(3/31) మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్ తలో వికెట్ తీసారు.

ఒకే ఓవర్‌లో 2 వికెట్లు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్లు మెరుగైన ఆరంభాన్ని అందించారు. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో వరుసగా బౌండరీలు బాదారు. అయితే ఈ జోడీని అర్ష్‌దీప్ సింగ్ విడదీసాడు. కమిల్ పూరన్(12)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన డేంజరస్ బ్యాటర్ షిమ్రాన్ హెట్‌మైర్ అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. ఈ వికెట్‌పై దుమారం రేగింది. సూపర్ డైవ్‌తో క్రీజులోకి చేరినా.. బ్యాట్ గాల్లో ఉండటంతో థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. అదే ఓవర్‌లో రోవ్‌మన్ పోవెల్(0)ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
దాంతో వెస్టిండీస్ పవర్ ప్లేలో 3 వికెట్లకు 44 పరుగులు చేసింది. షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్‌తో కలిసి షై హోప్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 36 బంతుల్లో షై హోప్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
మలుపు తిప్పిన నమన్ ధీర్..
63 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని నమన్ ధీర్ విడదీసాడు. షై హోప్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే రోస్టన్ ఛేజ్(5)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. రూథర్‌ఫోర్డ్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దూకుడుగా ఆడే క్రమంలో రొమారియో షెఫెర్డ్(7), మాథ్యూ ఫోర్డ్(9), షామర్ స్ప్రింగర్(9), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరారు. ఆఖరి ఓవర్‌లో అకీల్ హోసెన్(15) కూడా ఔటవ్వడంతో వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


