అంతా వారి వల్లే.. ఓటమికి కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్‌తో జరిగిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైన అనంతరం వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ తమ జట్టు మిడిలార్డర్ బ్యాటింగ్ వైఫల్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టుకు ఓపెనర్లు జస్టన్ గ్రీవ్స్, జాన్ కాంప్‌బెల్ తొలి వికెట్ కు 135 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో అద్భుతమైన పునాది వేశారు. దశాబ్ధ కాలం తర్వాత భారత్‌పై వన్డేల్లో వంద పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పిన వెస్టిండీస్ ఓపెనింగ్ జోడీగా వీరు నిలిచారు. అయితే ఈ అద్భుత ఆరంభాన్ని మిడిలార్డర్ బ్యాటర్లు ఉపయోగించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని, జట్టు అనుకున్న దానికంటే చాలా తక్కువ స్కోరుకే పరిమితమైందని వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ అభిప్రాయపడ్డాడు.

60 నుంచి 80 పరుగులు తక్కువగా చేశాం
మ్యాచ్ అనంతరం విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ మాట్లాడుతూ.."మేము ఖచ్చితంగా బోర్డుపై మరిన్ని పరుగులు చేయాల్సింది. భారత్‌లోని బ్యాటింగ్‌కు అనుకూలించే మంచి వికెట్లపై ఆడుతున్నప్పుడు భారీ స్కోరు సాధించడం చాలా ముఖ్యం. నిజం చెప్పాలంటే మేము మరో 60 నుంచి 80 పరుగులు తక్కువగా చేశాం. 290 పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు బౌలింగ్‌లో ప్రతీదీ పర్ఫెక్ట్ గా ఉండాలి" అని వ్యాఖ్యానించాడు.
మిడిలార్డర్ వైఫల్యమే ఓటమికి కారణం
ఓపెనర్ల ప్రదర్శనను ప్రశంసిస్తూనే మిడిలార్డర్ బాధ్యతారాహిత్యాన్ని షాయ్ హోప్ తప్పుపట్టాడు." ఓపెనర్లు జట్టుకు కావలసిన అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. గత కొన్ని సిరీస్‌లుగా ఓపెనింగ్ సమస్యను అధిగమించడానికి ప్రయత్నిస్తున్న మాకు ఇదొక మంచి పరిణామం. వారిద్దరూ బలమైన పునాది వేసినప్పటికీ.. మిడిలార్డర్ బ్యాటర్లు మిడిల్ ఓవర్లలో ఇబ్బంది పడి నెట్ రన్ రేట్‌ను పెంచలేకపోయారు. దీని వల్ల ఇన్నింగ్స్ ఆఖరి దశలో సవాలుతో కూడిన స్కోరు సాధించడం కష్టంగా మారింది" అని వెస్టిండీస్ కెప్టెన్ స్పష్టం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


