IND vs WI: కుల్దీప్ యాదవ్ ‘డబుల్ సెంచరీ’
టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న తొలి భారత స్పిన్నర్‌గా నిలిచాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో షై హోప్, కీమో పాల్‌ను ఔట్ చేయడం ద్వారా ఈ ఘనతను అందుకున్నాడు.
123 వన్డేల్లో 26.70 సగటుతో కుల్దీప్ యాదవ్ 200 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు సార్లు ఐదు వికెట్ల ఘనత ఉండగా.. 10 సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన చేశాడు. కుల్దీప్ యాదవ్ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 6/25గా ఉన్నాయి. మహమ్మద్ షమీ 104 వన్డేల్లో 200 వికెట్ల మైలురాయి అందుకొని అత్యంత వేగంగా ఈ ఘనత సాధించి తొలి భారత బౌలర్‌గా కొనసాగుతున్నాడు. కుల్దీప్ యాదవ్ రెండో స్థానంలో ఉండగా.. అజిత్ అగార్కర్ 133 వన్డేల్లో, జహీర్ ఖాన్ 144 వన్డేల్లో 200 వికెట్ల మార్క్‌ను చేరుకున్నారు.

భారత క్రికెట్‌లో ఇప్పటి వరకు 9 మంది బౌలర్లు 200 వికెట్ల మైలురాయి అందుకోగా.. అనిల్ కుంబ్లే 334 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. జవగళ్ శ్రీనాథ్ (315 వికెట్లు), అజిత్ అగార్కర్(288 వికెట్లు), జహీర్ ఖాన్(269 వికెట్లు, హర్భజన్ సింగ్(265 వికెట్లు), కపిల్ దేవ్(253 వికెట్లు), జడేజా(232 వికెట్లు), షమీ(206 వికెట్లు) కుల్దీప్ యాదవ్ కంటే ముందున్నారు.
వెస్టిండీస్ భారీ స్కోర్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 405 పరుగుల భారీ స్కోర్ చేసింది. జాన్ క్యాంబెల్(68 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101), కెప్టెన్ షై హోప్(94 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 104), అమీర్ జంగూ(77 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114) శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, జడేజా రెండేసి వికెట్లు తీయగా.. ప్రసిధ్ కృష్ణ ఒక వికెట్ పడగొట్టాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఒక ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు మూడు శతకాలు చేయడం ఇదే తొలిసారి. అంతేకాకుండా వన్డే క్రికెట్ చరిత్రలోనే వెస్టిండీస్‌కు ఇది రికార్డ్ స్కోర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


