కోహ్లీ కాదు.. మ్యాచ్‌ను తిప్పింది అతడే: శుభ్‌మన్ గిల్
తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు 8 వికెట్ల తేడా ఘన విజయం సాధించిన అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మ్యాచ్ ప్రదర్శనపై స్పందించారు. కెప్టెన్‌గా సెంచరీతో జట్టును నడిపించిన శుభ్‌మన్ గిల్ తన వ్యక్తిగత ఇన్నింగ్స్ తో పాటు మ్యాచ్ మలుపు తిప్పిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్, అలాగే నాటౌట్‌గా నిలిచి విరుచుకుపడిన విరాట్ కోహ్లీ ఆటతీరును ప్రశంసించారు.
తన సెంచరీ ఇన్నింగ్స్‌పై శుభ్‌మన్ గిల్ కామెంట్స్
తాను చేసిన 110 పరుగుల సెంచరీ గురించి శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. "నిజం చెప్పాలంటే నేను ఔటైనప్పుడు మ్యాచ్‌ను నేనే స్వయంగా ముగించి తిరిగి పెవిలియన్‌కు రావాల్సింది అనిపించింది. చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ ముగించి ఉంటే మరింత బాగుండేది. అయినప్పటికీ ఈ ఇన్నింగ్స్ నాకు చాలా సంతృప్తినిచ్చింది" అని గిల్ వ్యాఖ్యానించారు. ఇన్నింగ్స్ ప్రారంభంలో అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో వరుసగా కొట్టిన ఫోర్లలో కవర్స్ మీదుగా ఆడిన ఫ్రంట్-ఫుట్ డ్రైవ్ షాట్ తనకు అత్యంత ఇష్టమైనదిగా పేర్కొన్నారు.

కుల్దీప్ యాదవ్ రీఎంట్రీ
ఈ మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన కుల్దీప్ యాదవ్ గురించి చెబుతూ.. "కుల్దీప్ లాంటి క్వాలిటీ స్పిన్నర్ మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే అతనే జట్టులో ప్రధాన వికెట్ టేకర్‌గా మారుతాడు. ఈ విషయాన్ని కుల్దీప్ పదేపదే నిరూపించుకున్నాడు. ఈ రోజు కూడా అదే చేసి చూపించాడు. ఒకానొక దశలో వెస్టిండీస్ ఓపెనింగ్ భాగస్వామ్యం చూసి వారు 340-350 పరుగులు చేస్తారని భావించాం. కానీ కుల్దీప్ యాదవ్ వచ్చి మ్యాచ్‌ను మావైపు తిప్పాడు. ప్రత్యర్థిని 300 పరుగుల లోపే కట్టడం చేయడం మా జట్టు చేసిన అత్యుత్తమ ప్రయత్నం" అని గిల్ చెప్పుకొచ్చారు.
'విరాట్‌కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి'
కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి తనదైన శైలిలో ఆడేందుకు స్వేచ్ఛ ఇస్తారా అని అడిగిన ప్రశ్నకు గిల్ నవ్వుతూ సమాధానమిచ్చారు. "విరాట్ ప్రస్తుతం పూర్తి స్వేచ్ఛతో ఆటను ఎంతో ఆస్వాదిస్తూ బ్యాటింగ్ చేస్తున్నాడు. బౌండరీలు కొట్టే సత్తా అతనిలో ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు పూర్తి ఫామ్‌తో విజృంభిస్తున్నాడు. మన దేశం కోసం లెక్కలేనన్ని మ్యాచ్‌లు గెలిపించిన కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాళ్లకు మైదానంలో వారు కోరుకున్న విధంగా ఆడేందుకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించగలరు" అని విరాట్ కోహ్లీపై తన గౌరవాన్ని చాటుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


