Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: కేఎల్ రాహుల్ శతకం.. రోహిత్ విధ్వంసం! విండీస్ ముందు భారీ లక్ష్యం!

వెస్టిండీస్‌తో ఆఖరి వన్డేలో టీమిండియా 352 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. కేఎల్ రాహుల్(87 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 129 నాటౌట్) అజేయ శతకంతో కదం తొక్కడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 351 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(85 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 92) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.

రుతురాజ్ గైక్వాడ్(69 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. నమన్ ధీర్(21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) పర్వాలేదనిపించాడు. వెస్టిండీస్ బౌలర్లలో జైడెన్ సీల్స్(3/62) మూడు వికెట్లు తీయగా.. కీమో పాల్(2/71) రెండు వికెట్లు పడగొట్టాడు. గుడకేష్ మోతీ ఒక వికెట్ తీసాడు.

IND vs PAK: గట్టెక్కించిన శివమ్ దూబే.. ఉత్కంఠపోరు‌లో పాక్‌పై భారత్ విజయం!

IND vs PAK: గట్టెక్కించిన శివమ్ దూబే.. ఉత్కంఠపోరు‌లో పాక్‌పై భారత్ విజయం!

నిరాశపర్చిన గిల్, కోహ్లీ..

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. జైడెన్ సీల్స్ వేసిన మూడో ఓవర్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్(1), విరాట్ కోహ్లీ(0) వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. గిల్ క్యాచ్ ఔట్ కాగా.. విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో భారత్ 4 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ జట్టును ఆదుకున్నారు.

IND vs WI KL Rahul Hits Unbeaten Century as Rohit Sharma s 92 Powers India to 351 7

ఆచితూచి ఆడిన ఈ జోడీ తొలి పవర్ ప్లేలో 2 వికెట్లకు 28 పరుగులే చేసింది. పవర్ ప్లే అనంతరం రోహిత్ శర్మ దూకుగా ఆడాడు. ఈ క్రమంలో అతను 58 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా బ్యాట్ ఝులిపించడంతో భారత్ 19.5 ఓవర్లలో 100 పరుగులు చేసింది.

రోహిత్ సెంచరీ మిస్

రుతురాజ్ గైక్వాడ్ 64 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. రోహిత్ శర్మ సెంచరీ దిశగా సాగాడు. అయితే 92 పరుగుల వద్ద భారీ సిక్సర్ బాదే ప్రయత్నం చేసిన రోహిత్ శర్మ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగి శతకాన్ని చేజార్చుకున్నాడు. కాసేపు నిదానంగా ఆడి ఉంటే హిట్ మ్యాన్‌ సెంచరీ పూర్తయ్యేది.

కానీ కీమో పాల్ ఊరించే బౌన్సర్‌తో బోల్తా కొట్టించాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 137 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రోహిత్ ఔటైన వెంటనే రుతురాజ్ గైక్వాడ్ కూడా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్, నమన్ ధీర్ దూకుడుగా ఆడారు. విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.

IND vs WI: ఏడేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్! (వీడియో)

Also Read

IND vs WI: ఏడేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్! (వీడియో)

రాహుల్ శతకం..

రాహుల్ 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. నమన్ ధీర్(30) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 95 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. నితీష్ కుమార్ రెడ్డి(9) బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకోగా.. అన్షుల్ కంబోజ్‌(17)తో కలిసి రాహుల్‌ జట్టును ముందుకు నడిపించాడు.

కంబోజ్ 2 భారీ సిక్స్‌లతో ఆకట్టుకున్నాడు. అతను విఫలమైనా.. గుర్నూర్ బ్రార్ సాయంతో జట్టు స్కోర్‌ను 300 ధాటించిన రాహుల్... 80 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత ధాటిగా ఆడిన రాహుల్.. జట్టుకు 351 పరుగుల భారీ స్కోర్ అందించాడు.

Story first published: Saturday, October 3, 2026, 18:28 [IST]
Other articles published on Oct 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+