IND vs PAK: గట్టెక్కించిన శివమ్ దూబే.. ఉత్కంఠపోరులో పాక్‌పై భారత్ విజయం!
ఆసియా గేమ్స్ 2026లో భారత పురుషుల క్రికెట్ టీమ్ స్వర్ణ పతకం సాధించింది. పాకిస్థాన్‌తో శనివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో భారత్.. 19 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో భారత్‌కు స్వర్ణం దక్కగా.. పాకిస్థాన్‌కు సిల్వర్ మెడల్ వరించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అభిషేక్ శర్మ(28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 61), తిలక్ వర్మ(22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. చివర్లో శివమ్ దూబే(15బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27) దూకుడుగా ఆడాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(21), ఇషాన్ కిషన్(20) పర్వాలేదనిపించారు. పాకిస్థాన్ బౌలర్లలో అరఫత్ మిన్హాస్(2/25) రెండు వికెట్లు తీయగా.. సైమ్ అయూబ్, అహ్మద్ డానియల్, అబ్రర్ అహ్మద్ తలో వికెట్ తీసారు.

అనంతరం పాకిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 192 పరుగులే చేసి ఓటమిపాలైంది. హసన్ నవాజ్(51 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 96) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. అతనితో పాటు సైమ్ అయూబ్(29) రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్(2/29), వాషింగ్టన్ సుందర్(2/29), శివమ్ దూబే(2/33) రెండేసి వికెట్లు తీసారు.
హసన్ నవాజ్ విధ్వంసం..
211 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పాకిస్థాన్‌కు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ షాహిబ్జాద ఫర్హాన్‌ను వాషింగ్టన్ సుందర్ క్యాచ్ ఔట్ చేయగా.. ఉస్మాన్ ఖాన్(3)ను అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చాడు. నిలకడగా ఆడిన మాజ్ సదకత్(23)ను కూడా అక్షర్ పటేల్ ఔట్ చేయడంతో పాకిస్థాన్ 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో హసన్ నవాజ్, సైమ్ అయూబ్ జట్టును ఆదుకున్నారు. అయితే ఆరంభంలోనే హసన్ నవాజ్ ఇచ్చిన క్యాచ్‌ను వైభవ్ సూర్యవంశీ నేలపాలు చేశాడు. ఒకే క్యాచ్‌ను వైభవ్ సూర్యవంశీతో పాటు రవి బిష్ణోయ్ ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్నారు.
ఈ క్యాచ్ పట్టి ఉంటే హసన్ నవాజ్ 4 పరుగులకే వెనుదిరిగేవాడు. కానీ ఈ అవకాశంతో అతను భారత్‌ను వణికించాడు. సైమ్ ఆయూబ్‌తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సైమ్ ఆయూబ్ ఆచితూచి ఆడిన హసన్ నవాజ్ చెలరేగాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో భారీ సిక్స్‌లు బాదాడు. ఈ క్రమంలో 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని శివమ్ దూబే విడదీసాడు. సైమ్ అయూబ్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి నాలుగో వికెట్‌కు నమోదైన 87 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. సైమ్ అయూబ్ వెనుదిరిగినా.. నవాజ్ తన దూకుడు కొనసాగించాడు. కానీ అతనికి మరో ఎండ్‌లో సహకారం లభించలేదు.
ఆఖరి ఓవర్‌లో ఉత్కంఠ..
ఆఖరి ఓవర్‌లో పాకిస్థాన్ విజయానికి 33 పరుగులు రాగా.. శివమ్ దూబే వేసాడు. తొలి బంతినే నవాజ్ బౌండరీ తరలించడంతో మరుసటి బంతిని శివమ్ దూబే వైడ్ చేశాడు. దాంతో భారత శిభిరంలో ఉత్కంఠ తార స్థాయికి చేరింది. కానీ అద్భుతమైన యార్కర్‌తో వరుసగా రెండు డాట్ బాల్స్ వేయడంతో భారత విజయం లాంఛనమైంది. కీలక భాగస్వామ్యాన్ని విడదీయడంతో పాటు ఆఖరి ఓవర్‌లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి శివమ్ దూబే భారత్‌ను గెలిపించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


