ICC Rankings: పాక్ క్రికెటర్‌ను వెనక్కి నెట్టి టాప్ లేపిన అభిషేక్ శర్మ!
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ దుమ్మురేపాడు. అఫ్గాస్థాన్‌తో టీ20 సిరీస్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన అభిషేక్ శర్మ.. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తిరిగి టాప్-2 ర్యాంక్ అందుకున్నాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ బ్యాటర్ షాహిబ్జాద ఫర్హాన్‌ను వెనక్కి నెట్టాడు. భారత్‌కు చెందిన ఇషాన్ కిషన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ 82, 39 పరుగులతో రాణించాడు. దాంతో ఈ సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఈ ప్రదర్శనతో అభిషేక్ శర్మ.. ఒక స్థానం ఎగబాకి రెండో స్థానంలో నిలిచాడు. ఇషాన్ కిషన్ అగ్రస్థానానికి చేరువయ్యాడు.

ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య వ్యత్యాసం 51 రేటింగ్ పాయింట్స్ మాత్రమే. గతంలో అభిషేక్ శర్మ టాప్ ర్యాంకులో కొనసాగగా.. ఇషాన్ కిషన్ అద్వితీయమైన బ్యాటింగ్‌తో టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో టీ20లో హాఫ్ సెంచరీతో ఫామ్ అందుకున్న సంజూ శాంసన్(57).. నాలుగు స్థానాలు ఎగబాకి 30వ స్థానంలో నిలిచాడు. ఆఖరి టీ20లో అభిషేక్ చెలరేగితే తిరిగి టాప్ ర్యాంక్ అందుకునే అవకాశం ఉంది.
ఈ సిరీస్‌లో బ్యాటింగ్ అవకాశం రాని తిలక్ వర్మ ఒక స్థానం దిగజారి 8వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో వరుణ్ చక్రవర్తీ రెండు స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచాడు. జస్‌ప్రీత్ బుమ్రా ఏకంగా 7 స్థానాలు ఎగబాకి టాప్-10 ర్యాంక్ అందుకోగా.. అర్ష్‌దీప్ సింగ్ 11 స్థానాలు మెరుగుపర్చుకొని 14వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
ఆల్‌రౌండర్ల ర్యాంకుల్లో హార్దిక్ పాండ్యా రెండు స్థానాలు దిగజారగా.. శివమ్ దూబే 3 స్థానాలు కోల్పోయాడు. భారత్, అఫ్గానిస్థాన్ మధ్య ఆఖరి టీ20 గురువారం జరగనుంది. ఈ నెలాఖరులో ఆసియా గేమ్స్ 2026 కోసం భారత జట్టు జపాన్‌కు వెళ్లనుంది. అక్కడ జపాన్‌తో ఏకైక టీ20 కూడా ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


