IND vs WI: 148 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే ఇదే తొలిసారి..!
క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రికార్డ్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. తొలి 30 ఓవర్లలోనే 300 పరుగులు చేసిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో గౌహతి వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఈ ఫీట్ సాధించింది.
ఈ మ్యాచ్‌లో 406 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన భారత్.. శుభ్‌మన్ గిల్(130 బంతుల్లో 25 ఫోర్లు, 8 సిక్స్‌లతో 217 నాటౌట్), రోహిత్ శర్మ(75 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101) విధ్వంసకర బ్యాటింగ్‌తో 29.1 ఓవర్లలోనే 300 పరుగులు చేసింది. మరో 39 బంతులు మిగిలి ఉండగానే ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించి రికార్డ్ విజయాన్ని అందుకుంది.

క్రికెట్ చరిత్రలోనే మరే జట్టు కూడా 30 ఓవర్లలోపు 300 పరుగులు చేయలేదు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడటంతో ఈ రికార్డ్ సాధ్యమైంది. 10 ఓవర్లలోనే 92పరుగులు చేసిన ఈ జోడీ.. 21.1 ఓవర్లలో 200 పరుగుల మైలురాయిని అందుకుంది. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 200 పరుగులు చేసిన జట్టుగానూ భారత్ నిలిచింది.
తొలి వికెట్‌కు 255 పరుగులు జోడించిన అనంతరం రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగినా.. క్రీజులోకి వచ్చిన కోహ్లీ దూకుడుగా ఆడాడు. శుభ్‌మన్ గిల్ కూడా బౌండరీల మోత మోగించడంతో భారత్ 29.1 ఓవర్లలోనే (175 బంతుల్లో) 300 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
గతంలో సౌతాఫ్రికా మాత్రమే 32.2 ఓవర్లలో 300 పరుగులు చేసింది. 2006లో జోహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియాపై ఈ ఫీట్ సాధించింది. 2006లో శ్రీలంకపై ఇంగ్లండ్ 33.1 ఓవర్లలో, 2009లో శ్రీలంకపై భారత్ 34.1 ఓవర్లలో 300 పరుగులు చేశాయి.
ఈ పాత రికార్డ్‌లన్నింటిని తాజాగా భారత్ బద్దలుకొట్టింది. 30 ఓవర్లలోపే 300 పరుగులు సాధించిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. నామమాత్రపు ఆఖరి వన్డే శనివారం న్యూ చండీఘడ్ వేదికగా జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


