IND vs WI: వైభవ్ సూర్యవంశీకి నిరాశే.. రెండు మార్పులతో భారత్!
భారత్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న ఆఖరి టీ20లో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం అంతరాయం కారణంగా ఈ మ్యాచ్‌ను అంపైర్లు 9 ఓవర్లకు కుదించారు. వర్ష ప్రభావ పరిస్థితుల నేపథ్యంలోనే బౌలింగ్ ఎంచుకున్నట్లు వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ తెలిపాడు. డ్యూ ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని, ఛేజింగ్ ఈజీ అవుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు.
సిరీస్ గెలుస్తాం..
'మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించడం మాకు కలిసొస్తుందని అనుకుంటున్నా. మాకు మంచి బ్యాటింగ్ డెప్త్ ఉంది. చివరి బ్యాటర్ కూడా భారీ సిక్సర్లు బాదగలడు. ప్రస్తుతం మా ఫోకస్ అంతా బౌలింగ్‌పైనే ఉంది. ఈ తక్కువ ఓవర్ల మ్యాచ్‌లో మెరుగ్గా బౌలింగ్ చేసి మ్యాచ్‌పై పట్టు సాధించడమే మా గేమ్ ప్లాన్.

ఈ పర్యటనలో మాకు చాలా సానుకూల అంశాలు లభించాయి. ముఖ్యంగా బ్యాటింగ్, బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేశాం. ఇదే జోరును కొనసాగించి సిరీస్ గెలవాలనుకుంటున్నాం. భారత్‌లో గెలిచే అద్బుతమైన అవకాశం మాకు లభించింది. మా కుర్రాళ్లంతా ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం.'అని షై హోప్ చెప్పాడు.
దూకుడుగా ఆడటమే మా గేమ్ ప్లాన్..
మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. 'వర్షం పడిన తీరును చూసి ఈ మ్యాచ్ రద్దవుతుందని అనుకున్నా. కానీ ఇక్కడి అద్భుతమైన డ్రైనేజీ వ్యవస్థ కారణంగా మ్యాచ్ జరుగుతుంది. పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. మా గేమ్ ప్లాన్ చాలా సింపుల్. చాలా సానుకూలంగా దూకుడుగా ఆడాలి. వెస్టిండీస్ బాగా ఆడుతోంది. కానీ మేం వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. మా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి మ్యాచ్ గెలవడమే మా ఏకైక లక్ష్యం.
వెస్టిండీస్‌లో పవర్ హిట్టర్లు ఉన్నారు. చివరి బ్యాటర్ కూడా సిక్సర్లు బాదగలడు. ఇవన్నీ మాకు తెలుసు. కానీ అదే సమయంలో మా బలాలు ఏంటో కూడా మాకు తెలుసు. వాటిపైనే ఫోకస్ పెడుతున్నాం. తుది జట్టులో రెండు మార్పులు చేశాం. శివమ్ దూబే, భువనేశ్వర్ కుమార్ జట్టులోకి వచ్చారు.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కలేదు.
తుది జట్లు:
భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.
వెస్టిండీస్: షై హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), జువెల్ ఆండ్రూ, షిమ్రాన్ హెట్మైయర్, రోవ్‌మన్ పోవెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, రోస్టన్ చేజ్, కీమో పాల్, షమార్ స్ప్రింగర్, గూడాకేష్ మోటీ, షమార్ జోసెఫ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
