Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన సోనాల్ దినుషా.. 67 ఏళ్ల తర్వాత భారత్‌పై అరుదైన ఘనత!

శ్రీలంక బ్యాటర్ సోనాల్ దినుషా చరిత్ర సృష్టించాడు. భారత్‌పై వరుసగా మొదటి నాలుగు టెస్ట్‌ ఇన్నింగ్స్‌ల్లో 50+ స్కోర్లు నమోదు చేసిన తొలి ఆసియా బ్యాటర్‌గా నిలిచాడు. కొలంబో వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగులు చేసిన సోనాల్ దినుషా.. రెండో ఇన్నింగ్స్‌లో 106 పరుగలతో అజేయంగా కొనసాగుతున్నాడు.

IND vs SL: పంత్, మానవ్ సుతార్ వ్యూహం.. చేజారిన పసిందు శతకం! (వీడియో)

IND vs SL: పంత్, మానవ్ సుతార్ వ్యూహం.. చేజారిన పసిందు శతకం! (వీడియో)

తొలి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 100, 84 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా భారత్‌పై మొదటి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 50 ప్లస్ స్కోర్లు చేసిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. డగ్లస్ జార్డిన్, ఎవర్టన్ వీక్స్, క్లైడ్ వాల్కట్, కెన్ బారింగ్టన్.. సోనాల్ దినుషా కంటే ముందు ఈ ఫీట్ సాధించారు.

IND vs SL Sonal Dinusha Creates History Becomes First Asian Player to Achieve Rare Feat Against India in 67 Years

భారత్‌పై తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 50+ స్కోర్లు చేసిన బ్యాటర్లు..

డగ్లస్ జార్డిన్(ఇంగ్లండ్)-1932-33: 79, 85*, 60, 61

ఎవర్టన్ వీక్స్(వెస్టిండీస్)-1948: 128, 194, 162, 101

క్లైడ్ వాల్కట్(వెస్టిండీస్)-1948: 152, 68, 54, 108

కెన్ బార్రింగ్టన్(ఇంగ్లండ్)-1959: 56, 80, 80, 87

సోనాల్ దినుషా(శ్రీలంక)-2026: 100, 84, 103, 89 నాటౌట్

IND vs SL: టీమిండియాకు ఎదురుదెబ్బ.. భారీ లక్ష్యం దిశగా శ్రీలంక!

Also Read

IND vs SL: టీమిండియాకు ఎదురుదెబ్బ.. భారీ లక్ష్యం దిశగా శ్రీలంక!

టీమిండియా విజయానికి అడ్డుగా సోనాల్ దినుషా..

229/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. తొలి సెషన్‌లో ఒక్క వికెట్ కూడా కోల్పోని శ్రీలంక.. రెండో సెషన్‌లో మూడు వికెట్లు కోల్పోయినా సాధికారికంగా బ్యాటింగ్ చేసింది. ఇప్పటికే 191 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా సోనాల్ దినుషా భారత విజయవకాశాలకు అడ్డుగా నిలిచాడు.

కేశర నువాంతతో కలిసి ఏడో వికెట్‌కు 112 పరుగులు జోడించిన సోనాల్ దినుషా.. లాహిరు కుమార(12)తో కలిసి 9వ వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ క్రమంలో అతను 196 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడో సెషన్ కూడా ప్రారంభం కాగా.. ఆఖరి వికెట్ కోసం భారత బౌలర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే శ్రీలంక ఆధిక్యం 200 పరుగులకు చేరడంతో భారత్ విజయం సాధించడం కష్టమే.

Story first published: Thursday, August 27, 2026, 16:28 [IST]
Other articles published on Aug 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+