Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: పంత్, మానవ్ సుతార్ వ్యూహం.. చేజారిన పసిందు శతకం! (వీడియో)

శ్రీలంక బ్యాటర్ పసిందు సూర్యబండార తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. కొలంబో వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో సూర్యబండార అద్వితీయమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కెరీర్‌లో ఫస్ట్ సెంచరీ అందుకునేందుకు సిద్దమైన అతను టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్, స్పిన్నర్ మానవ్ సుతార్ బిగించిన ఉచ్చును పసిగట్టలేక మంచి అవకాశాన్ని కోల్పోయాడు.

మానవ్ సుతార్ బౌలింగ్‌లో రిషభ్ పంత్ కళ్లు చెదిరే స్టంపింగ్‌తో పెవిలియన్ చేరి శతకాన్ని చేజార్చుకున్నాడు. 173 బంతులు ఆడిన పసిందు సూర్యబండార 10 ఫోర్లు, సిక్స్‌తో 92 పరుగులు చేసి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.

నువ్వు కెప్టెన్ రా అయ్యా.. భయపడకు! సర్ఫరాజ్ ఖాన్ స్లెడ్జింగ్!(వీడియో)

నువ్వు కెప్టెన్ రా అయ్యా.. భయపడకు! సర్ఫరాజ్ ఖాన్ స్లెడ్జింగ్!(వీడియో)

పంత్ రాక్స్.. పసిందు షాక్

నాలుగో రోజు ఆఖరి సెషన్ ఆటలో ధనంజయ డిసిల్వాను మానవ్ సుతార్ ఔట్ చేయడంతో ఒత్తిడికి గురైన పసిందు త్వరగా సెంచరీ పూర్తి చేయాలనే ఆత్రుత‌లో భారీ షాట్ ఆడాలనుకున్నాడు. ఈ క్రమంలో అతను ఎల్బీడబ్ల్యూ కాగా.. రివ్యూతో బచాయించాడు. దాంతో పసిందు ఆత్రుత గమనించిన రిషభ్ పంత్.. వికెట్ పడేలా ఉందని తమ ఆటగాళ్లకు చెప్పాడు.

IND vs SL How Rishabh Pant and Manav Suthar Set Up Pasindu Sooriyabandara s dismissal in Colombo

పసిందు సూర్యబండార అసహనంగా ఉన్నాడని, వికెట్ పడటం ఖాయమని బౌలర్‌తో పాటు ఫీల్డర్లకు చెబుతూ గట్టిగా అరిచాడు. 'అతను కంగారు పడుతున్నాడు. మిడాన్‌లో ఎవరైనా రెడీగా ఉండండి.'అని అరిచాడు. మానవ్ సుతార్‌కు వైడ్ వేయాలని సైగలు చేశాడు. పంత్ చెప్పినట్లుగానే మానవ్ సుతార్ వైడ్ వేయగా.. స్టెప్ ఔటై భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన పసిందు బంతిని మిస్సయ్యాడు. దాంతో బంతిని అందుకున్న పంత్.. మూడు సెకన్ల వ్యవధిలోనే స్టంప్స్‌ను పడేసి పసిందును ఔట్ చేశాడు.

తొలి ఇన్నింగ్స్‌లోనూ..

సూర్యబండార చేజేతులా వికెట్ పారేసుకున్నాడని కామెంటేటర్ గట్టిగా అరిచాడు. మానవ్ సుతార్ తెలివిగా బౌలింగ్ చేసి వికెట్ దక్కించుకున్నాడని కొనియాడాడు. పసిందు సూర్యబండార తొలి ఇన్నింగ్స్‌లో కూడా తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. 133 బంతుల్లో 9 ఫోర్లతో 80 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

IND vs SL: మలుపు తిప్పిన మానవ్ సుతార్, ప్రసిధ్ కృష్ణ.. గెలుపు ముంగిట భారత్!

Also Read

IND vs SL: మలుపు తిప్పిన మానవ్ సుతార్, ప్రసిధ్ కృష్ణ.. గెలుపు ముంగిట భారత్!

గెలుపు ముంగిట భారత్..

ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపు ముంగిట నిలిచింది. 213 పరుగుల భారీ లోటుతో ఫాలో ఆన్ ఆడిన శ్రీలంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 72.4 ఓవర్లలో 6 వికెట్లకు 229 పరుగులు చేసింది. క్రీజులో కేశర నువాంత(3 బ్యాటింగ్), సోనాల్ దినుషా(7 బ్యాటింగ్) ఉన్నారు.

తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో ఆకట్టుకున్న సోనాల్ దినుషాను ఔట్ చేస్తే భారత విజయం లాంఛనం కానుంది. ప్రస్తుతం శ్రీలంక 16 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆఖరి రోజైన గురువారం శ్రీలంకను వీలైనంత త్వరగా ఆలౌట్ చేస్తే భారత్ విజయం సులువు అవుతుంది.

Story first published: Wednesday, August 26, 2026, 18:57 [IST]
Other articles published on Aug 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+