Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: టీమిండియాకు ఎదురుదెబ్బ.. భారీ లక్ష్యం దిశగా శ్రీలంక!

శ్రీలంకతో రెండో టెస్ట్‌లో టీమిండియా‌కు ఊహించని షాక్ తగిలింది. 229/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. తొలి సెషన్ ఆరంభంలోనే శ్రీలంకను ఆలౌట్ చేసి విజయం సాధించాలని భావించిన భారత్ ప్రణాళికలను దెబ్బతీసింది.

ఓవర్‌నైట్ బ్యాటర్ సోనాల్ దినుషా, కేశర నువాంత అద్వితీయమైన బ్యాటింగ్‌తో తొలి సెషన్‌లో భారత్ ఒక్క వికెట్ తీయలేకపోయింది. సోనాల్ దినుషా, కేశర నువాంత భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. 32 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఈ ఇద్దరూ.. 100 పరుగులు జోడించారు. సోనాల్ దినుషా.. 99 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో శ్రీలంక భారీ లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది.

IND vs SL India s Winning Chances Dip as Sonal Dinusha Keshara Nuwantha Stitch 112-Run Stand

రెండో సెషన్‌లోనూ ఈ జోడీ నిలకడగా ఆడింది. 112 పరుగుల భారీ భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని మానవ్ సుతార్ విడదీసాడు. హాఫ్ సెంచరీ ముంగిట కేశర నువాంత(150 బంతుల్లో 4 ఫోర్లతో 46)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి ప్రబాత్ జయసూర్య రాగా.. సోనాల్ దినుషా(71 బ్యాటింగ్) సెంచరీ దిశగా సాగుతున్నాడు.

రెండో సెషన్‌లోనూ శ్రీలంక పూర్తిగా బ్యాటింగ్ చేస్తే భారత్ విజయవకాశాలు దెబ్బతిననున్నాయి. అదే జరిగితే ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. శ్రీలంకను ఫాలో ఆన్ ఆడించి టీమిండియా తప్పు చేసిందా? అనే చర్చ జరుగుతోంది.


సంక్షిప్త స్కోర్లు..

భారత్ తొలి ఇన్నింగ్స్ 503/9 డిక్లేర్డ్ (దేవదత్ పడిక్కల్ 117, ధ్రువ్ జురెల్ 115 నాటౌట్)

శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 290 ఆలౌట్(పసిందు సూర్యబండార 80, సోనాల్ దినుషా 103)

శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 347/7*(పసిందు సూర్యబండార 92, కామిందు మెండీస్ 55, సోనాల్ దినుషా 72 నాటౌట్)

Story first published: Thursday, August 27, 2026, 13:39 [IST]
Other articles published on Aug 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+