నువ్వు కెప్టెన్ రా అయ్యా.. భయపడకు! సర్ఫరాజ్ ఖాన్ స్లెడ్జింగ్!(వీడియో)
భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్ కొనసాగుతోంది. తొలి రోజు ఆటలో యశస్వి జైస్వాల్-అసితా ఫెర్నాండో గొడవతో మొదలైన ఈ వైరం.. మూడో రోజు ఆటలోనూ కొనసాగింది. టీమిండియా సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ సర్ఫరాజ్ ఖాన్.. సరదా వ్యాఖ్యలతో శ్రీలంక కెప్టెన్ ధనంజయ డిసిల్వాను స్లెడ్జింగ్ చేశాడు.
గాయంతో రిషభ్ పంత్ ఫీల్డింగ్ చేయకపోవడంతో అతని స్థానంలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ తన స్లెడ్జింగ్‌తో నవ్వులు పూయించాడు. తరుచూ ఏదో ఒకటి మాట్లాడుతూ అటు బౌలర్లను ప్రోత్సహిస్తూనే.. ఇటూ బ్యాటర్లను రెచ్చగొట్టాడు. అతని స్లెడ్జింగ్ ప్రభావం వల్ల శ్రీలంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా, వికెట్ కీపర్ నిరోషన్ డిక్‌వెల్ల వెనువెంటనే ఔటయ్యారు.
బ్రో.. నువ్వు కెప్టెన్.. భయపడకు
ఇక మూడో రోజు ఆటలో మానవ్ సుతార్ బౌలింగ్ చేయడానికి సిద్దం కాగా.. ధనంజయ డిసిల్వా చివరి నిమిషంలో తప్పుకున్నాడు. దాంతో సర్ఫరాజ్ ఖాన్ తన నోటికి పని చెప్పాడు. ఆటను ఆలస్యం చేయడం ఆపి.. బంతిని ఎదుర్కోవడంపై దృష్టి పెట్టాలని హితవు పలికాడు. అంతేకాకుండా పరధ్యానంలో ఉండకుండా.. బంతిని స్ట్రైట్‌గా ఆడటంపై ఫోకస్ పెట్టాలని సూచించాడు. అతని వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి.

'అక్కడ ఏం లేదు బ్రో.. నువ్వే అనవసరంగా అటువైపు చూస్తూ సమయం వృధా చేస్తున్నావు బ్రో. భయపడకు.. నువ్వే కెప్టెన్. కమాన్ బ్రో..! అటువైపు చూసి ఎందుకు ఆందోళన పడుతున్నావు. స్ట్రైట్‌గా ఆడు'అని సర్ఫరాజ్ ఖాన్ అన్న మాటలు స్టంప్‌మైక్‌లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
సర్ఫరాజ్ స్లెడ్జింగ్‌కు ఔట్..
బ్రో.. బ్రో అంటూనే ధనంజయ డిసిల్వాను సర్ఫరాజ్ ఖాన్ రెచ్చగొట్టాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సర్ఫరాజ్ ఖాన్ స్లెడ్జింగ్ చేసిన కాసేపటికే ధనంజయ డిసిల్వా పెవిలియన్ చేరాడు. మానవ్ సుతార్ వేసిన 35 ఓవర్‌లో ధనంజయ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా.. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ గ్లౌవ్స్‌ను తాకుతూ స్లిప్ ఫీల్డర్ వైపు దూసుకెళ్లగా కేఎల్ రాహుల్ అందుకున్నాడు. దాంతో శ్రీలంక కెప్టెన్ ఇన్నింగ్స్ ముగిసింది.
పట్టు బిగించిన భారత్..
ఈ మ్యాచ్‌పై టీమిండియా పట్టు బిగించింది. బ్యాటింగ్ తరహాలోనే బౌలింగ్‌లోనూ సత్తా చాటడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 83.4 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. క్రీజులో లాహిరు కుమార(8 బ్యాటింగ్)తో పాటు సోనాల్ దినుషా(85 బ్యాటింగ్) ఉన్నాడు. పసిందు సూర్యబండార(133 బంతుల్లో 9 ఫోర్లతో 80) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ(3/47), మానవ్ సుతార్(3/83) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. అరంగేట్ర స్పిన్నర్ సారాన్ష్ జైన్ ఒక్క వికెట్ తీయలేకపోయాడు. శ్రీలంక ఇంకా 238 పరుగుల వెనుకంజలో ఉంది. నాలుగో రోజు ఆటలో వీలైనంత త్వరగా శ్రీలంకను ఆలౌట్ చేసి భారత్ బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది. ఒక సెషన్ పాటు బ్యాటింగ్ చేసి 300 ప్లస్ లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచి విజయం కోసం ప్రయత్నించనుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 503/9 స్కోర్ వద్ద డిక్లేర్డ్ చేసిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

