Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: ముగిసిన మూడో రోజు ఆట.. భారత్‌దే ఆధిపత్యం!

శ్రీలంకతో రెండో టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. బ్యాటింగ్‌ తరహాలోనే బౌలింగ్‌లోనూ సత్తా చాటింది. దాంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 83.4 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. క్రీజులో లాహిరు కుమార(8 బ్యాటింగ్)తో పాటు సోనాల్ దినుషా(85 బ్యాటింగ్) ఉన్నాడు. పసిందు సూర్యబండార(133 బంతుల్లో 9 ఫోర్లతో 80) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ(3/47), మానవ్ సుతార్(3/83) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. అరంగేట్ర స్పిన్నర్ సారాన్ష్ జైన్ ఒక్క వికెట్ తీయలేకపోయాడు. శ్రీలంక ఇంకా 238 పరుగుల వెనుకంజలో ఉంది. నాలుగో రోజు ఆటలో వీలైనంత త్వరగా శ్రీలంకను ఆలౌట్ చేసి భారత్‌ బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది. ఒక సెషన్ పాటు బ్యాటింగ్ చేసి 300 ప్లస్ లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచి విజయం కోసం ప్రయత్నించనుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 503/9 స్కోర్ వద్ద డిక్లేర్డ్ చేసిన సంగతి తెలిసిందే.

IND vs SL Manav Suthar and Prasidh Krishna s Three-Wicket Hauls Help India Dominate Day 3

ఆదిలోనే దెబ్బతీసిన భారత్..

8/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన శ్రీలంకకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కామిల్ మిషారా(19)ను ప్రసిధ్ కృష్ణ ఔట్ చేయగా.. కామిందు మెండీస్‌తో కలిసి పసిందు సూర్య బండార ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో అతను 76 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 87 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని ప్రసిధ్ కృష్ణ విడదీసాడు. కామిందు మెండీస్(32)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో శ్రీలంక 130/4 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

ఆదుకున్న పసిందు, దినుషా..

ఈ సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో రెండో సెషన్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. సెకండ్ సెషన్ ఆరంభంలోనే ధనంజయ డిసిల్వా(8)ను మానవ్ సుతార్ పెవిలియన్ చేర్చాడు. దాంతో శ్రీలంక 137 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో సోనాల్ దినుషాతో కలిసి పసిందు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.

సెంచరీ దిశగా సాగిన పసిందు‌ను జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే నిరోషన్ డిక్‌వెల్లా(0)ను సిరాజ్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. కేశర నువాంతతో కలిసి సోనాల్ దినుషా పోరాడాడు. తొలి టెస్ట్ ఫామ్‌ను కొనసాగిస్తూ.. 82 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో శ్రీలంక 216/7 స్కోర్‌తో టీ బ్రేక్‌కు వెళ్లింది.

ఆఖరి సెషన్‌లోనూ ఈ జోడీ ఆచితూచి ఆడింది. 57 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని మానవ్ సుతార్ విడదీసాడు. ఈ వికెట్‌తో 20 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. లాహిరు కుమారా ఆచితూచి ఆడగా.. సొనాల్ దినుషా తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. మరో వికెట్ పడకుండా ఈ ఇద్దరూ జాగ్రత్త పడటంతో శ్రీలంక 265/8 స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ముగించింది.

Story first published: Tuesday, August 25, 2026, 17:45 [IST]
Other articles published on Aug 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+