Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: శ్రీలంక బ్యాటర్‌పై ఐసీసీ చర్యలు.. ఎందుకంటే?

శ్రీలంక బ్యాటర్ ప్రభాత్ జయసూర్యపై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్(ఐసీసీ) చర్యలు తీసుకుంది. భారత్‌తో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో ప్రభాత్ జయసూర్య..ఐసీసీ నియమావళిని ఉల్లంఘించాడనే కారణంతో ఓ డీ మెరిట్‌ పాయింట్ కేటాయించడంతో పాటు మందలించింది. రెండో రోజు ఆటలో మానవ్ సుతార్ బౌలింగ్‌లో ఔటైన ప్రభాత్ జయసూర్య.. మైదానం వీడే సమయంలో బౌండరీ లైన్‌ను బ్యాట్‌తో కొట్టాడు.

ఈ చర్య ఐసీసీ ఆర్టికల్ 2.2 క్రికెట్ పరికరాలు, దుస్తులు, మైదాన సామగ్రిని ధ్వంసం చేయడం కిందికి వస్తుంది. దాంతో అతను ఐసీసీ లెవెల్ 1 రూల్‌ను ఉల్లంఘించినట్లు తేలింది. ప్రభాత్ జయసూర్య తన తప్పిదాన్ని, విధించిన శిక్షను అంగీకరించాడు. దాంతో ఈ వ్యవహారానికి సంబంధించి తదుపరి విచారణ అవసరం లేదని ఐసీసీ తమ ప్రకటనలో పేర్కొంది.

IND vs SL ICC Takes Action Against Prabath Jayasuriya After His Outburst on Day 2 of Colombo Test

భారత్ 503/9 డిక్లేర్డ్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 భారీ స్కోర్ వద్ద డిక్లేర్డ్ చేసింది. ధ్రువ్ జురెల్(177 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 115 నాటౌట్), దేవదత్ పడిక్కల్(193 బంతుల్లో 12 ఫోర్లతో 117) సెంచరీలతో రాణించగా.. రిషభ్ పంత్(89 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 63), శుభ్‌మన్ గిల్(108 బంతుల్లో 6 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.

శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో(4/106) నాలుగు వికెట్లు తీయగా..ప్రభాత్ జయసూర్య, కేశర నువాంత్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లాహిరు కుమారాకు ఒక వికెట్ దక్కింది.

శ్రీలంక 265/8

అనంతరం శ్రీలంక మూడో రోజు ఆట ముగిసే సమయానికి 83.4 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. క్రీజులో లాహిరు కుమార(8 బ్యాటింగ్)తో పాటు సోనాల్ దినుషా(85 బ్యాటింగ్) ఉన్నాడు. పసిందు సూర్యబండార(133 బంతుల్లో 9 ఫోర్లతో 80) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ(3/47), మానవ్ సుతార్(3/83) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. అరంగేట్ర స్పిన్నర్ సారాన్ష్ జైన్ ఒక్క వికెట్ తీయలేకపోయాడు. శ్రీలంక ఇంకా 238 పరుగుల వెనుకంజలో ఉంది.

Story first published: Tuesday, August 25, 2026, 18:03 [IST]
Other articles published on Aug 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+