పడిక్కల్ కాదు.. అతని వల్లే భారత్ గెలిచింది! ప్రపంచాన్ని ఏలుతాడు: హనుమ విహారి
టీమిండియా యువ స్పిన్నర్ మానవ్ సుతార్‌పై వెటరన్ బ్యాటర్ హనుమ విహారి ప్రశంసల జల్లు కురిపించాడు. శ్రీలంకతో తొలి టెస్ట్‌లో భారత్ విజయానికి ప్రధాన కారణం మానవ్ సుతార్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనే అని అభిప్రాయపడ్డాడు. భవిష్యత్తుల్లో అతను టెస్ట్ క్రికెట్‌ను ఏలుతాడని జోస్యం చెప్పాడు.
గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 165 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మానవ్ సుతార్ 10 వికెట్ల ప్రదర్శనతో శ్రీలంక పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన మానవ్ సుతార్.. రెండో ఇన్నింగ్స్‌లో (6/55) ఆరు వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ 33 పరుగులు చేశాడు.
మానవ్ సుతార్ బౌలింగ్‌తోనే విజయం..
తాజాగా మానవ్ సుతార్ ప్రదర్శన గురించి మాట్లాడిన హనుమ విహారీ అతని బౌలింగ్ తీరును వివరించాడు.'శ్రీలంకతో భారత్ విజయానికి ప్రధాన కారణం మానవ్ సుతార్ బౌలింగ్. అతను వికెట్లు తీసాడని ఈ మాట చెప్పడం లేదు. అతను ఎలాగూ వికెట్లు తీస్తున్నాడు. అతను బౌలింగ్ చేసిన విధానం అద్భుతం.

ఒక అద్భుతమైన స్పిన్నర్‌కు కావాల్సిన లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయి. స్పిన్నర్‌కు రిస్ట్ పొజిషన్ సరిగ్గా ఉంటే బంతి టర్న్ అవుతుంది. అదే బాడీ బ్యాటర్ వైపు కదులుతూ.. బాల్ వెనుకాలే ఉంటే టర్న్‌తో పాటు డ్రిఫ్ట్ కూడా లభిస్తుంది. మరో విషయం గమనిస్తే మానవ్ సుతార్ బౌలింగ్ యాక్షన్ కాస్త డయాగ్నల్(క్రాస్‌గా)గా ఉంది.
టెస్ట్ క్రికెట్‌ను ఏలుతాడు..
బౌలింగ్ యాక్షన్‌లోకి వచ్చాక మానవ్ సుతార్ క్రీజ్‌కి చాలా దగ్గరగా ఉంటాడు. దాంతో అతని ఫోకస్ మొత్తం స్టంప్స్‌పైనే ఉంటుంది. అతను ప్రధానంగా స్టంప్ లైన్‌లోనే బౌలింగ్ చేస్తాడు కాబట్టే అతనికి ఎక్కువగా వికెట్లు ఎల్బీడబ్ల్యూ, బౌల్డ్ రూపంలోనే వస్తాయి. అదే అతని అతిపెద్ద బలం. అంతేకాకుండా అతని యాక్షన్ కూడా చాలా ఫ్లూయెంట్‌గా ఉంది.
భవిష్యత్తులో అతను వరల్డ్ టెస్ట్ బౌలర్ అవుతాడు.'అని హనమ విహారి చెప్పుకొచ్చాడు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ ఆదివారం నుంచి కొలంబో వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కూడా గెలిచి రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో భారత్ ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
