Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. శ్రీలంక ముందు భారీ లక్ష్యం!

ఆసియా గేమ్స్ 2026లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సెమీఫైనల్లో భారత్ 170 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. ఇషాన్ కిషన్(46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 80 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 169 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్‌కు తోడుగా వైభవ్ సూర్యవంశీ(21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) దూకుడుగా ఆడాడు.

Asian Games 2026: భారత్‌ ధగధగ.. గంట వ్యవధిలోనే రెండు స్వర్ణాలు!

Asian Games 2026: భారత్‌ ధగధగ.. గంట వ్యవధిలోనే రెండు స్వర్ణాలు!

బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న ఈ వికెట్‌పై అభిషేక్ శర్మ(7), సంజూ శాంసన్(7), శ్రేయస్ అయ్యర్(13), అక్షర్ పటేల్(8), తిలక్ వర్మ(2), శివమ్ దూబే(3) తీవ్రంగా నిరాశపర్చారు. దూకుడుగా ఆడే క్రమంలో వైభవ్ సూర్యవంశీ క్యాచ్ ఔటవ్వగా.. ఇషాన్ కిషన్ ఒంటరి పోరాటం చేసి పోరాడే లక్ష్యాన్ని అందించాడు. శ్రీలంక బౌలర్లలో తారిండు రత్నాయకే, సహాన్ అరాచ్‌చిగే రెండేసి వికెట్లు తీయగా.. వానుజా సాహన్, లసిత్ క్రూస్పుల్లే, నువానిడు ఫెర్నాండో తలో వికెట్ తీసారు.

IND vs SL Ishan Kishan Unbeaten 80 Vaibhav Sooryavanshi s 38 Power India to 169 7 in Asian Games Semi-Final

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. రెండో ఓవర్‌లోనే చెత్త షాట్‌తో అభిషేక్ శర్మ క్యాచ్ ఔటవ్వగా.. మూడో ఓవర్‌లో సంజూ శాంసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి వైభవ్ చెలరేగాడు. దాంతో భారత్ పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం వైభవ్ క్యాచ్ ఔటవ్వగా.. నిలకడగా ఆడిన శ్రేయస్ అయ్యర్‌ను సాహాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు.

IND vs WI: మా విజయానికి కారణం అదే: శుభ్‌మన్ గిల్

Also Read

IND vs WI: మా విజయానికి కారణం అదే: శుభ్‌మన్ గిల్

ఓవైపు వికెట్లు పడినా మరోవైపు ఇషాన్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. అక్షర్ పటేల్ సాయంతో ఇషాన్ కిషన్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అక్షర్ పటేల్, తిలక్ వర్మ, శివమ్ దూబేలు కూడా క్రీజులో ఎక్కువ సేపు ఉండలేకపోయారు. ఆఖరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన వాషింగ్టన్ సుందర్ భారీ సిక్సర్‌తో జట్టు స్కోర్‌ను 169 పరుగులకు చేర్చాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న ఈ వికెట్‌పై ఇది భారీ లక్ష్యమే.

Story first published: Thursday, October 1, 2026, 11:34 [IST]
Other articles published on Oct 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+