Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: కుప్పకూలిన శ్రీలంక.. భారత్‌కు భారీ ఆధిక్యం!

శ్రీలంకతో రెండో టెస్ట్‌లో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. 265/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 89.4 ఓవర్లలో 290 పరుగులకు కుప్పకూలింది. ఓవర్‌నైట్ బ్యాటర్ సోనాల్ దినుషా(162 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 103) సెంచరీతో చెలరేగాడు.

IND vs SL: శ్రీలంక బ్యాటర్‌పై ఐసీసీ చర్యలు.. ఎందుకంటే?

IND vs SL: శ్రీలంక బ్యాటర్‌పై ఐసీసీ చర్యలు.. ఎందుకంటే?

శ్రీలంక చివరి రెండు వికెట్లను అరంగేట్ర స్పిన్నర్ సారాన్ష్ జైన్ దక్కించుకున్నాడు. ప్రసిధ్ కృష్ణ(3/52), మానవ్ సుతార్(3/85) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. ఓవర్‌నైట్ స్కోర్‌కు శ్రీలంక 25 పరుగులు మాత్రమే జోడించింది.

IND vs SL India Take 213-Run Lead After Sri Lanka Bowled Out for 290 in Colombo Test

అనంతరం శ్రీలంకను భారత్ ఫాలో ఆన్ ఆడిస్తోంది. దాంతో 213 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ లాహిరు ఉడారా(3)ను మహమ్మద్ సిరాజ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన కామిల్ మిశార(7 బ్యాటింగ్), పసిందు సూర్యబండార(2 బ్యాటింగ్)ఆచితూచి ఆడుతున్నారు. వీలైనంత త్వరంగా శ్రీలంకను ఆలౌట్ చేసి ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించాలనే పట్టుదలతో భారత్ ఉంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 భారీ స్కోర్ వద్ద డిక్లేర్డ్ చేసిన సంగతి తెలిసిందే. ధ్రువ్ జురెల్(177 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 115 నాటౌట్), దేవదత్ పడిక్కల్(193 బంతుల్లో 12 ఫోర్లతో 117) సెంచరీలతో రాణించగా.. రిషభ్ పంత్(89 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 63), శుభ్‌మన్ గిల్(108 బంతుల్లో 6 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో(4/106) నాలుగు వికెట్లు తీయగా..ప్రభాత్ జయసూర్య కేశర నువాంత్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లాహిరు కుమారాకు ఒక వికెట్ దక్కింది.

నువ్వు కెప్టెన్ రా అయ్యా.. భయపడకు! సర్ఫరాజ్ ఖాన్ స్లెడ్జింగ్!(వీడియో)

Also Read

నువ్వు కెప్టెన్ రా అయ్యా.. భయపడకు! సర్ఫరాజ్ ఖాన్ స్లెడ్జింగ్!(వీడియో)

సంక్షిప్త స్కోర్లు..

భారత్ తొలి ఇన్నింగ్స్: 503/9 డిక్లేర్డ్(దేవదత్ పడిక్కల్ 117, ధ్రువ్ జురెల్ 115 నాటౌట్)

శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 290 ఆలౌట్( సోనాల్ దినుషా 103, పసిందు సూర్యబండార 80)

Story first published: Wednesday, August 26, 2026, 11:10 [IST]
Other articles published on Aug 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+