Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: ధ్రువ్ జురెల్ శతకం.. భారీ స్కోర్ వద్ద భారత్ డిక్లేర్డ్!

శ్రీలంకతో రెండో టెస్ట్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ధ్రువ్ జురెల్(177 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 115 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌ను భారత్ 503/9 భారీ స్కోర్ వద్ద డిక్లేర్డ్ చేసింది. రిషభ్ పంత్(89 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీతో రాణించాడు.

IND vs SL: ధోనీ రికార్డ్ బద్దలు కొట్టిన రిషభ్ పంత్.. తొలి వికెట్ కీపర్‌గా..!

IND vs SL: ధోనీ రికార్డ్ బద్దలు కొట్టిన రిషభ్ పంత్.. తొలి వికెట్ కీపర్‌గా..!

తొలి రోజు ఆటలో దేవదత్ పడిక్కల్(193 బంతుల్లో 12 ఫోర్లతో 117) సెంచరీతో చెలరేగగా.. శుభ్‌మన్ గిల్(108 బంతుల్లో 6 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే. శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో(4/106) నాలుగు వికెట్లు తీయగా..ప్రభాత్ జయసూర్య కేశర నువాంత్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లాహిరు కుమారాకు ఒక వికెట్ దక్కింది.

అనంతరం శ్రీలంక బ్యాటింగ్‌కు దిగగా 2 బంతులు పడగానే వర్షం అంతరాయం కలిగించింది. ఆ తర్వాత ఆట తిరిగి ప్రారంభం కాగా.. శ్రీలంక 3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 8 పరుగులు చేసింది. లాహిరు ఉడారా(1) ప్రసిధ్ కృష్ణ ఔట్ చేయగా.. ప్రభాత్ జయసూర్య(2)ను మానవ్ సుతార్ పెవిలియన్ చేర్చాడు. వర్షం కారణంగా రెండో రోజు 56 ఓవర్ల ఆటనే సాధ్యమైంది.

IND vs SL Dhruv Jurel Unbeaten 115 Powers India to 503 9 Declared in 2nd Test at Colombo

పంత్ విధ్వంసం..

300/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓవర్‌నైట్ బ్యాటర్ సారాన్ష్ జైన్(6) రెండు పరుగులు మాత్రమే చేసి అసితా ఫెర్నాండో బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో తొలి రోజు ఆటలో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన రిషభ్ పంత్ మళ్లీ బ్యాటింగ్‌కు దిగాడు.

ధ్రువ్ జురెల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. తనదైన శైలిలో చెలరేగిన ఈ జోడీ వేగంగా పరుగులు రాబట్టింది. ముఖ్యంగా పంత్ భారీ షాట్లతో లంకబౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో పంత్ 81 బంతుల్లో అర్థశతకం పూర్తి చేసుకోగా.. ధ్రువ్ జురెల్ 97 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. దాంతో భారత్ 419/6 స్కోర్ వద్ద లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

ధ్రువ్ జురెల్ శతకం..

రెండో సెషన్‌లో పంత్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అయితే అతన్ని కుశార నువాంత క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో ఏడో వికెట్‌కు నమోదైన 112 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి మానవ్ సుతార్ రాగా.. ధ్రువ్ జురెల్ తన జోరును కొనసాగించాడు. ఆచితూచిన ఆడిన మానవ్ సుతార్(18)ను ప్రబాత్ జయసూర్య కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చగా.. సిరాజ్‌తో కలిసి ధ్రువ్ జురెల్ రెండో సెషన్‌ను ముగించాడు. వర్షం కారణంగా కాస్త ముందుగానే ఈ సెషన్ ముగిసింది.

IND vs SL: అసిత ఫెర్నాండోతో గొడవ.. యశస్వి జైస్వాల్‌కు భారీ ఊరట!

Also Read

IND vs SL: అసిత ఫెర్నాండోతో గొడవ.. యశస్వి జైస్వాల్‌కు భారీ ఊరట!

ఆఖరి సెషన్‌లో దూకుడుగా ఆడిన ధ్రువ్ జురెల్ 171 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ వెంటనే భారీ సిక్సర్‌తో ధ్రువ్ జురెల్ తన జోరు కనబర్చగా.. సిరాజ్(3) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దూకుడుగా ఆడిన ధ్రువ్ జురెల్ వేగంగా పరుగులు రాబట్టి జట్టు స్కోర్‌ను 500 ధాటించాడు. ఆ వెంటనే భారత్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లెర్డ్ చేసింది.

Story first published: Monday, August 24, 2026, 17:43 [IST]
Other articles published on Aug 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+