అందుకే జై జవాన్.. జై కిసాన్ సెలెబ్రేషన్స్: ధ్రువ్ జురెల్ (వీడియో)
శ్రీలంకతో రెండో టెస్ట్‌లో సెంచరీతో చెలరేగిన ధ్రువ్ జురెల్ వినూత్నంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. సెంచరీ పూర్తయిన వెంటనే గాల్లోకి ఎగురుతూ పంచ్ ఇచ్చిన ధ్రువ్ జురెల్.. అనంతరం తన బైసెప్‌పై ఉన్న 'జై జవాన్.. జై కిసాన్' అనే టాటూను చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఈ యూనిక్ సెలెబ్రేషన్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. రెండో రోజు ఆట అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న ధ్రువ్ జురెల్.. ఆ సెలెబ్రేషన్స్ వెనుక ఉన్న కారణాన్ని వెల్లడించాడు.
మా తాత, తండ్రి కోసం..
ఆ టాటూ వెనుక తన కుటుంబ నేపథ్యం దాగి ఉందని వెల్లడించాడు. 'మా తాత ఓ రైతు, తండ్రి సైనికుడు. కాబట్టి.. నేను నా మూలాలను మర్చిపోను. అందుకే జై జవాన్.. జై కిసాన్ అంటే టాటూ వేయించుకున్నాను. ఈ సెలెబ్రేషన్ కూడా మా తాత, తండ్రిని ఉద్దేశించి చేసుకున్నదే.'అని ధ్రువ్ జురెల్ పేర్కొన్నాడు.

తన సెంచరీపై స్పందిస్తూ.. 'నేను ఇప్పటికే భారత్-ఏ తరఫున ఇక్కడ(శ్రీలంకలో) ఆడాను. రెండు మ్యాచ్‌ల్లో ఒక సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ కూడా చేశాను. కాబట్టి నాకు ఇక్కడి పరిస్థితుల గురించి తెలుసు. బ్యాటింగ్ చేసేటప్పుడు భాగస్వామ్యాలను నెలకొల్పడానికే ప్రయత్నించాను. పరిస్థితులను అంచనా వేస్తూ అందుకు తగ్గట్లు ఆడాలని, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మా కోచ్, కెప్టెన్ ఎప్పుడూ చెబుతుంటారు. నేను అదే చేశాను.
ఒత్తిడి తగ్గదు..
సెంచరీ చేసినా నాలో ఒత్తిడి ఏ మాత్రం తగ్గదు. ఎందుకంటే భారత్‌కు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కడం నా అదృష్టం. కాబట్టి ఎప్పుడూ మనసులో కంగారు ఉంటుంది. ఈ రోజు నేను సెంచరీ చేసినా.. రేపు మళ్లీ సున్నా నుంచి ప్రారంభించాలి. కాబట్టి ఒత్తిడి అనే భావన మిగిలే ఉంటుంది.
నా సెంచరీకి సహకరించిన మహమ్మద్ సిరాజ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. అతను 29 బంతుల పాటు క్రీజులో నిలబడి నా కోసం డిఫెండ్ చేశాడు. 99 పరుగుల వద్ద సింగిల్ తీసేటప్పుడు చాలా కంగారు పడ్డాను. ఫీల్డర్ బంతికి దగ్గరగా రావడంతో డైవ్ చేశాను(నవ్వుతూ).
అతను సవాల్ విసరడంతోనే..
నేను క్రీజులోకి రాగానే సెంచరీ చేయాలని శ్రీలంక వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా సవాల్ విసిరాడు. అతని సవాల్‌కు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలని నిర్ణయించుకొని శతకం పూర్తి చేశాను. రిషభ్ పంత్ కుడి భుజానికి స్వల్ప గాయం కావడంతోనే నేను కీపింగ్ చేయాల్సి వచ్చింది. మూడో రోజుకు పంత్ కోలుకుంటాడని ఆశిస్తున్నా.'అని ధ్రువ్ జురెల్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

