సెంచరీ చేసి జై జవాన్.. జై కిసాన్ అన్న ధ్రువ్ జురెల్!(వీడియో)
శ్రీలంకతో రెండో టెస్ట్‌లో సెంచరీ బాదిన టీమిండియా యువ బ్యాటర్ ధ్రువ్ జురెల్ తనదైన శైలిలో సెలెబ్రేట్ చేసుకున్నాడు. టెయిలెండర్ మహమ్మద్ సిరాజ్ సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్న ధ్రువ్ జురెల్.. వెంటనే హెల్మెట్ తీసి గాల్లోకి ఎగురుతూ పంచ్ ఇచ్చాడు. ఆ తర్వాత తన బైసెప్స్‌పై ఉన్న టాటూ చూపిస్తూ సంతోషం వ్యక్తం చేశాడు.
అతని బైసెప్ట్స్‌పై 'జై జవాన్.. జై కిసాన్'అనే టాటూ ఉంది. కెరీర్‌లో ధ్రువ్ జురెల్‌కు ఇది రెండో శతకం కాగా.. అతని సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ధ్రువ్ జురెల్ సెంచరీ సెలెబ్రేషన్స్ బాగుందని కామెంట్ చేస్తున్నారు.

ధ్రువ్ జురెల్ శతకానికి మహమ్మద్ సిరాజ్ అండగా నిలిచాడు. 29 బంతులు ఆడిన 3 పరుగులు చేసిన సిరాజ్.. ధ్రువ్ జురెల్ సెంచరీ అనంతరం ఔటయ్యాడు. 99 పరుగులు వద్ద జురెల్ రనౌట్ తప్పించుకొని శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అసితా ఫెర్నాండో బౌలింగ్‌లో జురెల్ క్విక్ సింగిల్‌కు ప్రయత్నించాడు. కానీ బంతిని వేగంగా అందుకున్న ఫీల్డర్ స్టంప్ వైపు విసిరేయగా.. అంతకంటే వేగంగా జురెల్ క్రీజును చేరి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డైరెక్ట్ హిట్ కాకపోవడంతో జురెల్ రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత రెండు భారీ సిక్స్‌లు బాదిన ధ్రువ్ జురెల్ జట్టు స్కోర్‌ను 500 ధాటించాడు.
ఆ వెంటనే తొలి ఇన్నింగ్స్‌ను భారత్ 503/9 భారీ స్కోర్ వద్ద డిక్లేర్డ్ చేసింది. రిషభ్ పంత్(89 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీతో రాణించాడు. తొలి రోజు ఆటలో దేవదత్ పడిక్కల్(193 బంతుల్లో 12 ఫోర్లతో 117) సెంచరీతో చెలరేగగా.. శుభ్‌మన్ గిల్(108 బంతుల్లో 6 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే. శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో(4/106) నాలుగు వికెట్లు తీయగా..ప్రభాత్ జయసూర్య కేశర నువాంత్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లాహిరు కుమారాకు ఒక వికెట్ దక్కింది.
అనంతరం శ్రీలంక బ్యాటింగ్‌కు దిగగా 2 బంతులు పడగానే వర్షం అంతరాయం కలిగించింది. ఆ తర్వాత ఆట తిరిగి ప్రారంభం కాగా.. శ్రీలంక 3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 8 పరుగులు చేసింది. లాహిరు ఉడారా(1) ప్రసిధ్ కృష్ణ ఔట్ చేయగా.. ప్రభాత్ జయసూర్య(2)ను మానవ్ సుతార్ పెవిలియన్ చేర్చాడు. వర్షం కారణంగా రెండో రోజు 56 ఓవర్ల ఆటనే సాధ్యమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

