IND vs SL: టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో సాయి సుదర్శన్ ఔట్! రిప్లేస్‌మెంట్ ఎవరంటే..?
మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లుంది టీమిండియా పరిస్థితి. ఇప్పటికే గాయాలతో స్టార్ ఆటగాళ్లంతా దూరంగా కాగా.. తాజాగా ఆ జాబితాలో యువ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా చేరాడు. కాలి బొటనవేలి గాయం నుంచి కోలుకోకపోవడంతో సాయి సుదర్శన్ శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
భారత్-ఏ తరఫున శ్రీలంక-ఏతో జరిగిన సిరీస్‌లో సాయి సుదర్శన్ కాలి వేలికి గాయమైంది. అయినా శ్రీలకంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు సాయి సుదర్శన్‌ను ఎంపిక చేసిన సెలెక్టర్లు.. ఫిట్‌నెస్ నిరూపించుకుంటే సిరీస్‌లో కొనసాగుతాడని తెలిపారు. అయితే తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో సాయి సుదర్శన్ గాయం తగ్గలేదని తేలింది. దాంతో అతను ఈ సిరీస్ మొత్తానికి దూరం కావాల్సి వచ్చింది. అయితే సాయి సుదర్శన్ దూరమవ్వడంపై బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆ సమయంలోనే అతనికి రిప్లేస్‌మెంట్‌గా మరో ఆటగాడిని ఎంపిక చేయవచ్చు.

పడిక్కల్‌కు మార్గం సుగుమం..
సాయి సుదర్శన్ గైర్హాజరీతో దేవదత్ పడిక్కల్ మార్గం సుగుమమైంది. మూడో స్థానంలో దేవదత్ పడిక్కలే ఆడనున్నాడు. శ్రీలంక ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల వామప్ మ్యాచ్‌లో పడిక్కల్ సెంచరీతో చెలరేగాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న పడిక్కల్‌ను తుది జట్టులోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే జస్‌ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి గాయాలతో ఈ పర్యటనకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో సాయి సుదర్శన్ చేరాడు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. నెట్ సెషన్‌లో బంతి అతని కుడి చేతి బొటన వేలికి బలంగా తాకింది. దాంతో అతను వామప్ మ్యాచ్‌కు దూరంగా ఉండి చికిత్స తీసుకుంటున్నాడు. ఇప్పుడు సాయి సుదర్శన్ కూడా దూరమవడంతో భారత బ్యాటింగ్ లైనప్ బలహీనంగా కనిపిస్తోంది.
గాయాలపై శుభ్‌మన్ గిల్ ఆందోళన..
ఆటగాళ్ల వరుస గాయాలు భారత్‌ను కలవరపెడుతున్నాయి. వన్డే ప్రపంచకప్ 2027, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027 ఫైనల్‌కు సిద్దమయ్యే క్రమంలో ఆటగాళ్లు ఇలా వరుసగా గాయాలతో జట్టుకు దూరమవ్వడంపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ పరాజయం అనంతరం మాట్లాడుతూ.. ఆటగాళ్ల గాయాలు జట్టు ప్రణాళికలను దెబ్బతీస్తాయన్నాడు. ఆటగాళ్లంతా ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకోవాలని సూచించాడు.
'ఉదయం మైదానానికి వచ్చాక ఒక ఆటగాడికి చిన్న గాయమైనట్లు తెలుస్తోంది. అప్పుడు రిస్క్ తీసుకోవాలా? వద్దా? అనే సందిగ్దత నెలకొంటుంది. ఒక ఆటగాడు 80 శాతం మాత్రమే ఫిట్‌గా ఉంటే.. అతను తుది జట్టులోకి తీసుకుంటే ఐదు ఓవర్లు మాత్రమే వేసి మైదానం వీడుతాడు. అప్పుడు మిగతా ఓవర్లు ఎవరు వేయాలి? ఇది చాలా కష్టంగా ఉంటుంది.
కాబట్టి జట్టుగా ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవాలి. ఈ ధోరణి ఇలానే కొనసాగితే.. అప్‌కమింగ్ టోర్నీలపై.. ముఖ్యంగా వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్‌లో సౌతాఫ్రికాలో జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శనపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది.'అని శుభ్‌మన్ గిల్ ఆందోళన వ్యక్తం చేశాడు. శ్రీలంకతో తొలి టెస్ట్ ఆగస్ట్ 15న ప్రారంభం కానుండగా.. రెండో టెస్ట్ ఆగస్ట్ 23 నుంచి మొదలవ్వనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు భారత్ చేరాలంటే ఈ సిరీస్‌ను టీమిండియా గెలవడం కీలకం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

