Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: శతక్కొట్టిన దేవదత్ పడిక్కల్.. నిరాశపర్చిన రిషభ్ పంత్!

శ్రీలంకతో రెండు టెస్ట్‌లకు ముందు సన్నాహకంగా జరుగుతున్న వామప్ మ్యాచ్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ముందుగా బౌలింగ్‌లో తేలిపోయిన భారత్.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ చేతులెత్తేసింది. శ్రీలంక స్పిన్నర్ల ధాటికి భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్(121 బంతుల్లో 14 ఫోర్లతో 103 రిటైర్డ్ ఔట్) ఒక్కడే శతకంతో చెలరేగడంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ దిశగా సాగుతోంది.

రెండో రోజు ఆటలో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. విశ్వ ఫెర్నాండో వేసిన తొలి ఓవర్‌ రెండో బంతికే యశస్వి జైస్వాల్(0).. దిలుమ్ సుదీర్‌కు క్యాచ్ ఇచ్చి సిల్వర్ డక్‌గా వెనుదిరిగాడు. వైడ్‌‌బాల్‌ను వెంటాడి మరీ మూల్యం చెల్లించుకున్నాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో పాటు, దేవదత్ పడిక్కల్ ఆచితూచి ఆడి రెండో వికెట్‌కు 96 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీకి చేరువైన కేఎల్ రాహుల్‌(40)ను నువాంత క్లీన్ బౌల్డ్ చేశాడు.

India vs Sri Lanka XI Warm-Up Day 2 Rishabh Pant Falls Cheaply After Devdutt Padikkal s Century

రవీంద్ర జడేజా సాయంతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించిన దేవదత్ పడిక్కల్ 121 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ మరుసటి బంతికే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి రిషభ్ పంత్ వచ్చాడు. కానీ అతను ఐదు బంతుల్లో 2 పరుగులు చేసి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ధ్రువ్ జురెల్ కూడా ఆ కాసేపటికే క్యాచ్ ఔటయ్యాడు. ఈ ఇద్దరినీ స్పిన్నర్ రమేష్ మెండీస్ పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ 174 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో మానవ్ సుతార్(3 బ్యాటింగ్) పాటు రవీంద్ర జడేజా ఉన్నారు. టీ బ్రేక్ సమయానికి భారత్ 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. శ్రీలంక కంటే 183 పరుగుల వెనుకంజలో ఉంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ను 90 ఓవర్లలో 363/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. నిషాన్ ఫెర్నాండో(65 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 66), రావిందు రసంతా(143 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 71), కెప్టెన్ సోనాల్ దినుషా(72 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(2/64), కుల్దీప్ యాదవ్(2/76), మానవ్ సుతార్(2/33) రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, యువ బౌలర్ సరాన్ష్ జైన్ ఒక్క వికెట్ తీయలేకపోయారు.

Story first published: Saturday, August 8, 2026, 15:06 [IST]
Other articles published on Aug 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+