IND vs SL వామప్ మ్యాచ్.. తేలిపోయిన భారత బౌలర్లు!
శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు సన్నాహకంగా సాగుతున్న వామప్ మ్యాచ్‌లో భారత బౌలర్లు తేలిపోయారు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై శ్రీలంక ఎలెవన్ బ్యాటర్లు అద్భుతమైన బ్యాటింగ్‌తో భారీ స్కోర్ నమోదు చేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఎలెవన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 363 పరుగులు చేసింది.
నిషాన్ ఫెర్నాండో(65 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 66), రావిందు రసంతా(143 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 71), కెప్టెన్ సోనాల్ దినుషా(72 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(2/64), కుల్దీప్ యాదవ్(2/76), మానవ్ సుతార్(2/33) రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, యువ బౌలర్ సరాన్ష్ జైన్ ఒక్క వికెట్ తీయలేకపోయారు.
జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన అకిబ్ నబీకి బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. భారత పేలవ ఫీల్డింగ్ కూడా శ్రీలంక బ్యాటర్లకు కలిసొచ్చింది. పలు క్యాచ్ డ్రాప్‌లతో శ్రీలంక బ్యాటర్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

తొలి సెషన్ శ్రీలంకదే..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక బ్యాటర్లను భారత బౌలర్లు ఇబ్బంది పెట్టలేకపోయారు. పూర్తిగా గ్రీనీష్ వికెట్‌పై సిరాజ్, ప్రసిధ్ కృష్ణ ప్రభావం చూపలేకపోయారు. దాంతో తొలి సెషన్‌లో శ్రీలంక బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు.
వన్డే తరహా బ్యాటింగ్‌తో చెలరేగిన ఓపెనర్ నిషాన్ ఫెర్నాండో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ దిశగా సాగిన అతన్ని కేఎల్ రాహుల్ రనౌట్ చేశాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 110 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తొలి సెషన్ ముగిసేసరికి శ్రీలంక ఎలెవన్ వికెట్ నష్టానికి 138 పరుగులు చేసింది.
రెండో సెషన్‌లోనూ
రెండో సెషన్‌లోనూ శ్రీలంక బ్యాటర్లు చెలరేగారు. రావిందు రసంతా(71) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. పాసిందు సూరియాబండార రెండో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. అతన్ని జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. సెంచరీ దిశగా సాగిన రావిందు రసంతాను మానవ్ సుతార్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. పవన్ రత్నాయకే(39)ను గుర్నూర్ బ్రార్ ఔట్ చేయడంతో శ్రీలంక 246/4తో రెండో సెషన్‌ను ముగించింది. ఈ సెషన్‌లో ఇరు జట్లు సమంగా నిలిచాయి.
చెలరేగిన స్పిన్నర్లు..
మూడో సెషన్‌లో భారత స్పిన్నర్లు చెలరేగారు. కెప్టెన్ సోనాల్ దినుషా(52) హాఫ్ సెంచరీతో రాణించినా.. మిగతా బ్యాటర్లను పెవిలియన్‌కు చేర్చారు. అహన్ విక్రమసింఘే(31), అంజాలా బండార(13)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. రమేష్ మెండీస్(32)ను జడేజా క్యాచ్ ఔట్ చేశాడు. సోనాల్ దినుషాను మానవ్ సుతార్ ఔట్ చేయగా.. దిలుమ్ సుదీర, కేశర నువాంత మరో వికెట్ పడకుండా తొలి రోజు ఆటను ముగించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

