Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: పోరా చంటోడా.. వైభవ్‌ సూర్యవంశీని ఎగతాళి చేసిన పాక్ బౌలర్!(వీడియో)

భారత్ X పాకిస్థాన్ మధ్య జరిగిన ఆసియా గేమ్స్ 2026 ఫైనల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని పాకిస్థాన్ స్పిన్నర్ సైమ్ అయూబ్ ఎగతాళి చేశాడు. వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన అనంతరం.. ఓవరాక్షన్ చేశాడు. పిల్లాడిని ఊయల ఊపుతున్నట్లు సైగలు చేసాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పోరా చంటోడా అన్నట్లు ఆ సైగలు ఉన్నాయని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Asian Games 2026: గోల్ఫ్‌లో డబుల్ ధమాకా.. చరిత్ర సృష్టించిన ప్రణవి ఉర్స్!

Asian Games 2026: గోల్ఫ్‌లో డబుల్ ధమాకా.. చరిత్ర సృష్టించిన ప్రణవి ఉర్స్!

అసలేం జరిగిందంటే..?

ఈ ఘటన భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని వైభవ్ సూర్యవంశీ స్విచ్ హిట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి వేగాన్ని అంచనా వేయడం విఫలమవడంతో బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్ కీపర్ చేతిలో పడింది. దాంతో సైమ్ అయూబ్ గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నారు. చేతిలో పిల్లాడిని ఊపుతున్నట్లుగా సైగలు చేశాడు.

IND vs PAK Saim Ayub Baby Act For Vaibhav Sooryavanshi Goes Viral In India-Pakistan Final

అయితే ఈ సెలెబ్రేషన్స్‌ను సీరియస్‌గా తీసుకున్న అభిషేక్ శర్మ.. సైమ్ అయూబ్‌పై విరుచుకుపడ్డాడు. అదే ఓవర్‌లోనే భారీ సిక్సర్‌తో పాటు రెండు బౌండరీలు బాది ప్రతీకారం తీర్చుకున్నాడు. అప్పటికే రెండు సిక్స్‌లు బాది జోరు మీదున్న వైభవ్.. అనవసరంగా రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఈ షాట్ ఆడటంపై అభిషేక్ శర్మ కూడా అసహనానికి గురయ్యాడు.

Asian Games 2026: గోల్ఫ్‌లో డబుల్ ధమాకా.. చరిత్ర సృష్టించిన ప్రణవి ఉర్స్!

Also Read

Asian Games 2026: గోల్ఫ్‌లో డబుల్ ధమాకా.. చరిత్ర సృష్టించిన ప్రణవి ఉర్స్!

భారత్ భారీ స్కోర్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ(28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 61), తిలక్ వర్మ(22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. చివర్లో శివమ్ దూబే(15బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27) దూకుడుగా ఆడాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(21), ఇషాన్ కిషన్(20) పర్వాలేదనిపించారు. పాకిస్థాన్ బౌలర్లలో అరఫత్ మిన్హాస్(2/25) రెండు వికెట్లు తీయగా.. సైమ్ అయూబ్, అహ్మద్ డానియల్, అబ్రర్ అహ్మద్ తలో వికెట్ తీసారు.

Story first published: Saturday, October 3, 2026, 12:49 [IST]
Other articles published on Oct 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+