IND vs PAK: టాస్ గెలిచిన భారత్.. బరిలో టినేజ్ సెన్సేషన్!
ఆసియా గేమ్స్ 2026లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న ఫైనల్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్టులో ఎలాంటి మార్పు చేయకుండా విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగింది. టీనేజ్‌సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని కొనసాగించడంతో పాటు ఏకైక పేసర్‌గా జస్‌ప్రీత్ బుమ్రాను బరిలోకి దించింది. దాంతో అర్ష్‌దీప్ సింగ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.
శ్రీలంకతో సెమీఫైనల్లో ఈ విభిన్నమైన కాంబినేషన్ మంచి ఫలితాన్ని ఇవ్వడంతో వీవీఎస్ లక్ష్మణ్ సారథ్యంలోని భారత టీమ్ మేనేజ్‌మెంట్ దానికే కట్టుబడింది. వైభవ్ సూర్యవంశీ ఓపెనర్‌గా ఆడనుండటంతో సంజూ శాంసన్ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు. మరోవైపు పాకిస్థాన్ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది.మహమ్మద్ వసీం జూనియర్ స్థానంలో సాద్ మసూద్ జట్టులోకి వచ్చాడు.

శ్రీలంకతో సెమీఫైనల్ తరహాలోనే పాకిస్థాన్‌ను చిత్తు చేసి గోల్డ్ మెడల్ సాధించాలని భారత్ భావిస్తోంది. మరోవైపు భారత్‌కు షాకిచ్చి భారీ విజయంతో ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో పాకిస్థాన్ ఉంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 తర్వాత భారత్‌పై పాకిస్థాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. జపాన్ పిచ్‌లు పూర్తిగా స్పిన్‌కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో మెరుగైన బ్యాటింగ్ చేసినజట్టుకే విజయం వరించనుంది.
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు మాట్లాడిన ఇషాన్ కిషన్.. వ్యక్తిగత స్కోర్ల కంటే జట్టు విజయమే ముఖ్యమని స్పష్టం చేశాడు. జట్టులో ఎంత మంది మంచి ఆటగాళ్లు ఉన్నా.. దేశం తరఫున ఆడేటప్పుడు ఒత్తిడి ఉంటుందన్నాడు. అభిమానుల మద్దతు అద్భుతమని, జపాన్ ప్రజలు చూపించే ప్రేమ బాగుందని చెప్పాడు. ప్రపంచంలో ఎక్కడ ఆడినా భారత అభిమానులు మైదానానికి వచ్చి ఇచ్చే మద్దతు తమకు ఎంతో కొండంత బలాన్ని ఇస్తుందన్నాడు.
తుది జట్లు
భారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (WK), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా.
పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్ (కెప్టెన్), మాజ్ సదాకత్, ఉస్మాన్ ఖాన్ (WK), సైమ్ అయూబ్, హసన్ నవాజ్, అబ్దుల్ సమద్, అరాఫత్ మిన్హాస్, అహ్మద్ డానియాల్, సాద్ మసూద్, అబ్రార్ అహ్మద్, సుఫియాన్ మొకిమ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


