Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ZIM: హర్మన్‌ప్రీత్ కౌర్ మ్యాచ్ విన్నింగ్ సెంచరీ.. ఒక్క మాట మాట్లాడని స్మృతి మంధాన!

భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ప్రస్తుత సారథి స్మృతి మంధాన మధ్య విభేదాలు కొనసాగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కెప్టెన్సీ విషయంలో ఈ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

తాజాగా జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో ఈ విషయం రుజువైంది. ఆదివారం వడోదర వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్(121 బంతుల్లో 15 ఫోర్లతో 126)మ్యాచ్ విన్నింగ్ సెంచరీతో భారత్‌కు అద్భుమైన విజయాన్ని అందించింది. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన స్మృతి మంధాన హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తమ జట్టు 300 పరుగులు చేయడానికి హర్మన్‌ప్రీత్ కౌర్, ప్రతీక, దీప్తి కారణమని చెప్పిన స్మృతి మంధాన అంతకుమించి ఆమె బ్యాటింగ్ గురించి ఏం చెప్పలేదు.

IND vs NZ 3rd T20: వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. మూడో టీ20లో భారత తుది జట్టు ఇదే!

IND vs NZ 3rd T20: వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. మూడో టీ20లో భారత తుది జట్టు ఇదే!

దీప్తి శర్మపై ప్రశంసలు..

కానీ దీప్తి శర్మ బ్యాటింగ్‌పై మాత్రం ప్రశంసల జల్లు కురిపించింది. దాంతో స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్నట్లున్నాయని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. దీప్తి శర్మ అసాధారణమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసిందని స్మృతి మంధాన చెప్పుకొచ్చింది. 'ఈ రోజు మ్యాచ్‌లోని అతిపెద్ద సానుకూలాంశం 19/2 స్థితి నుంచి 300 ప్లస్ పరుగులు చేయడమే. హర్మన్‌, ప్రతీక, దీప్తి అసాధారణ బ్యాటింగ్‌తోనే ఇది సాధ్యమైంది. వాళ్ల ఆట చాలా చూడ ముచ్చటగా అనిపించింది.

IND vs ZIM Smriti Mandhana Makes No Mention of Harmanpreet Kaur s Match-Winning Century After 2nd ODI

దీప్తి శర్మ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. వన్డే ప్రపంచకప్‌లో కూడా ఆమె ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు ఎన్నో చేసింది. దురదృష్టవశాత్తూ లోయరార్డర్‌లో బ్యాటింగ్ చేయడం వల్ల తనకు ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం ఉండదు. కానీ ఈ రోజు తను క్రీజులో నిలబడి సెంచరీ సాధించడం చాలా సంతోషాన్నిచ్చింది.

జింబాబ్వే ఫీల్డింగ్ అదుర్స్..

వైష్ణవి కూడా అద్భుతంగా బౌలింగ్ చేసింది. పేస్‌లో వేరియషన్స్ చూపిస్తూ విభిన్నమైన బంతులను సంధించింది. ఆమెకు తన బౌలింగ్‌పై పూర్తి అవగాహన ఉంది. అది ఒక కెప్టెన్‌గా నాకు కలిసొచ్చే అంశం. మిగతా బౌలర్లు కూడా తమ వంతు సహకారం అందించారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తీవ్ర ఎండలో 4-5 ఓవర్లు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ ఈ రోజు ఎండ కాస్త తక్కువగానే ఉంది. అయినా సరే.. బ్యాటర్లకు బౌలింగ్ అలవాటుపడిపోకుండా బౌలర్లను తరుచూ మార్చాను. మా జట్టులో నైపుణ్యమైన బౌలర్లు ఉన్నారు. ఏ సమయంలో బంతి అందించినా సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తారు.

IND vs NZ 3rd T20: వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. మూడో టీ20లో భారత తుది జట్టు ఇదే!

Also Read

IND vs NZ 3rd T20: వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. మూడో టీ20లో భారత తుది జట్టు ఇదే!

ఈ మ్యాచ్‌లో ఓడినా జింబాబ్వే ఫీల్డింగ్‌తో అదరగొట్టింది. ముఖ్యంగా పాయింట్ దిశలో వారు 20-30 పరుగులు సేవ్ చేశారు. తీవ్రమైన ఎండలో కూడా 50 ఓవర్ల పాటు ఒకే ఇంటెన్సిటితో ఫీల్డింగ్ చేశారు. ఆఖరి ఓవర్‌లో కూడా బంతి కోసం డైవ్ చేస్తూ కనిపించారు. నాకు తెలిసి ఈ భారత పర్యటనలో వారు ఒక్క క్యాచ్ కూడా వదల్లేదనుకుంటా. ఇది మహిళా క్రికెట్‌కు శుభపరిణామం.'అని స్మృతి మంధాన చెప్పుకొచ్చింది.

భారత్ ఘన విజయం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్లకు 328 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ(106 నాటౌట్) సెంచరీలతో రాణించగా.. ప్రతీకా రావల్(61) హాఫ్ సెంచరీతో సత్తా చాటింది మంధాన(0) మాత్రం సిల్వర్ డక్‌గా వెనుదిరిగి నిరాశపర్చింది.

అనంతరం జింబాబ్వే 48.5 ఓవర్లలో 207 పరుగులకు కుప్పకూలింది. వైష్ణవి శర్మ(4/39) నాలుగు వికెట్లు తీయగా..దీప్తి శర్మ(3/32) మూడు వికెట్లు పడగొట్టింది. సయాలి, జింటిమణి కలిత, శ్రీచరణి తలో వికెట్ తీసారు. ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే బుధవారం జరగనుంది.

Story first published: Monday, October 26, 2026, 10:00 [IST]
Other articles published on Oct 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+