Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీలను ఆడించలేదు: టీమిండియా స్పిన్ కోచ్

టీమ్ కాంబినేషన్‌, పిచ్ కండిషన్స్‌తో పాటు స్పిన్ బౌలింగ్ చేయగల ఆటగాళ్లు జట్టులో ఉండటంతోనే కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీలకు అవకాశం దక్కలేదని టీమిండియా స్పిన్ కోచ్ సాయిరాజ్ బహుతులే తెలిపాడు. తదుపరి మ్యాచ్‌ల్లో వారికి తప్పకుండా అవకాశం దక్కుతుందని చెప్పాడు.

ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఐదు టీ20ల సిరీస్‌ను ఇప్పటికే 3-1తో కైవసం చేసుకుంది. అయితే వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో టీమిండియా స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండానే ఆడింది. శుక్రవారం వెల్లింగ్టన్ వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ 87 పరుగుల తేడాతో చిత్తయ్యింది. భారత బౌలర్లు విఫలమవడంతో 259 పరుగుల భారీ స్కోర్ చేసిన న్యూజిలాండ్.. అనంతరం 172 పరుగులకే కట్టడి చేసి అద్భుత విజయాన్ని అందుకుంది.

IND vs NZ India Spin Coach Sairaj Bahutule Explains Why Kuldeep Yadav and Varun Chakaravarthy Were Benched
కజిన్ సిస్టర్స్‌ను పెళ్లి చేసుకున్న పాకిస్థాన్ క్రికెటర్లు!

కజిన్ సిస్టర్స్‌ను పెళ్లి చేసుకున్న పాకిస్థాన్ క్రికెటర్లు!

టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే..

అయితే స్పెషలిస్ట్ స్పిన్నర్లు అయిన కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీలకు అవకాశం ఇవ్వకపోవడాన్ని పలువురు మాజీ క్రికెటర్లతో పాటు నెటిజన్లు తప్పుబట్టారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ల అవసరం లేదని, నమన్ ధీర్ వంటి ఆల్‌రౌండర్లతో జట్టును నడిపించాలని గంభీర్ భావిస్తున్నాడా? అనే విమర్శలు వచ్చాయి. నాలుగో టీ20 పరాజయం అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న సాయిరాజ్ బహుతులే.. కుల్దీప్, వరుణ్ చక్రవర్తీని ఆడించకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు.

'కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీలు మ్యాచ్ ఆడేందుకు పూర్తి ఫిట్‌నెస్‌తోనే ఉన్నారు. కానీ టీమ్ కాంబినేషన్, పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే వారికి అవకాశం దక్కలేదు. ఈ విషయం వారికి కూడా తెలుసు. తుది జట్టులో లేకపోయినా.. వారు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అవకాశం లభించినప్పుడు సత్తా చాటేందుకు సిద్దంగా ఉన్నారు.

IND vs NZ: భారత వన్డే జట్టులోకి జమ్మూ సెన్సేషన్!

Also Read

IND vs NZ: భారత వన్డే జట్టులోకి జమ్మూ సెన్సేషన్!

తదుపరి మ్యాచ్‌ల్లో అవకాశం..

జట్టులో స్పిన్ ఆప్షన్ కూడా ఎక్కువగా ఉండటంతో వారిని ఆడించాల్సిన అవసరం జట్టుకు రాలేదు. అక్షర్ పటేల్ పవర్ ప్లేలో బౌలింగ్ చేయగలడు. నమన్ ధీర్‌తో పాటు అవసరమైతే అభిషేక్ శర్మ కూడా స్పిన్ బౌలింగ్ చేస్తాడు. అతను ఇప్పటికే నెట్స్‌లో క్రమం తప్పకుండా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.

అయితే కుల్దీప్, వరుణ్ చక్రవర్తీలు ఏ దశలోనైనా బౌలింగ్ చేయగలరు. తదుపరి టీ20, వన్డే సిరీస్‌లో వారికి తప్పకుండా అవకాశం లభిస్తుంది. ఆక్లాండ్ మైదానం బౌండరీలు చాలా చిన్నవి. బౌలర్లు తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయారు. దాంతోనే ఓటమిఎదురైంది. హామిల్టన్‌లో జరిగే ఆఖరి మ్యాచ్‌కు పిచ్ స్వభావాన్ని బట్టి బౌలింగ్ కాంబినేషన్‌ను ఎంపిక చేస్తాం.'అని సాయిరాజ్ బహుతులే చెప్పుకొచ్చారు.

Story first published: Saturday, October 31, 2026, 12:48 [IST]
Other articles published on Oct 31, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+