Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే తుది జట్టు‌లో రెండు మార్పులు చేశాం: శ్రేయస్ అయ్యర్

టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే తుది జట్టులో రెండు మార్పులు చేశామని టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్‌ను అర్థం చేసుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని టాస్ సందర్భంగా శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. మ్యాచ్‌ల మధ్య పెద్దగా గ్యాప్ లేదు. అందుకే పిచ్ ఎలా ఉందో? బౌన్స్ ఎలా ఉంటుందో అంచనా వేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడి వాతావరణానికి, టైమ్ డిఫరెన్స్‌కు అలవాటు పడేందుకు కాస్త సమయం పట్టినా.. సర్దుబాటు చేసుకున్నాం. మేమంతా ప్రొఫెషనల్స్ కాబట్టి ఎలాంటి ఫిర్యాదులు లేవు.

వైభవ్ అంటేనే భయపడుతున్న కివీస్.. కెప్టెన్ శాంట్నర్ సెన్సేషనల్ కామెంట్స్!

వైభవ్ అంటేనే భయపడుతున్న కివీస్.. కెప్టెన్ శాంట్నర్ సెన్సేషనల్ కామెంట్స్!
IND vs NZ Shreyas Iyer Reveals Why India Picked Nitish Reddy and Mayank Yadav for 1st T20I against New Zealand

వెస్టిండీస్‌తో సిరీస్‌లో చాలా విషయాలు నేర్చుకున్నాం. ముఖ్యంగా ప్రతీ మ్యాచ్‌లో 230-250 పరుగులు చేయడం బ్యాటింగ్‌‌కు కలిసొచ్చింది. చిన్నమైదానాలు, ఫ్లాట్ పిచ్‌లపై బౌలింగ్ చేయడం కష్టమే అయినా.. బౌలర్లు మంచి కసి చూపించారు. అదే సానుకూల దృక్పథంతో ఇక్కడా ఆడాలనుకుంటున్నాం. ఈ మ్యాచ్ కోసం మా తుది జట్టులో రెండు మార్పులు చేశాం. శివమ్ దూబే స్థానంలో నితీష్ రెడ్డి, ప్రిన్స్ యాదవ్ స్థానంలో మయాంక్ యాదవ్ బరిలోకి దిగుతున్నాడు.'అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తెలిపాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. పిచ్ చాలా తాజాగా ఉంది. ఈ సిరీస్ కోసం మా జట్టంతా ఉత్సాహంగా ఉంది. భారత్‌పై ఆడటం ఎప్పుడూ సరదాగా ఉంటుంది. మా జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు. బెవాన్ జాకోబ్ ఎంత విధ్వంసకర బ్యాటరో ఇప్పటికే చూపెట్టాడు.'అని మిచెల్ సాంట్నర్ చెప్పుకొచ్చాడు.

ఇది మాకు కొత్త కాదు.. అతని రాకతో మా బలం పెరిగింది: శ్రేయస్ అయ్యర్

Also Read

ఇది మాకు కొత్త కాదు.. అతని రాకతో మా బలం పెరిగింది: శ్రేయస్ అయ్యర్

తుది జట్లు:

భారత్: సంజూ శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్.

న్యూజిలాండ్: ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్(కీపర్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకోబ్స్, మైకెల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, ఆడమ్ మిల్నే, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్.

Story first published: Thursday, October 22, 2026, 12:39 [IST]
Other articles published on Oct 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+