వైభవ్ అంటేనే భయపడుతున్న కివీస్.. కెప్టెన్ శాంట్నర్ సెన్సేషనల్ కామెంట్స్!
న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా రేపటి నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్‌కు ముందు భారత యువ బ్యాటర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కితే ఆయనను అడ్డుకోవడం తమ బౌలర్లకు పెద్ద సవాలు అని.. అందుకే ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేశామని తెలిపారు.
వైభవ్ సూర్యవంశీపై కివీస్ వ్యూహం
భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం లభించడం కష్టమని చెప్పినప్పటికీ.. న్యూజిలాండ్ యాజమాన్యం మాత్రం ఆ యువ ఆటగాడిపై దృష్టి సారించడం గమనార్హం. మీడియా సమావేశంలో శాంట్నర్ మాట్లాడుతూ.. "వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో ఎంతటి విధ్వంసకర బ్యాటింగ్ చేశాడో మేమందరం చూశాం. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ.. వైభవ్ సూర్యవంశీ ఎంత ప్రమాదకరమైన ఆటగాడో మాకు తెలుసు. ఒకవేళ ఆయనకు ఈ సిరీస్‌లో ఆడే అవకాశం వస్తే ఆయన దూకుడును అడ్డుకోవడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం" అని స్పష్టం చేశారు.

భువనేశ్వర్ కుమార్‌తో ఎదురయ్యే సవాలు
దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత టీ20 జట్టులోకి వచ్చిన స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ గురించి కూడా శాంట్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. "న్యూజిలాండ్ పరిస్థితులు భువీ బౌలింగ్ శైలికి బాగా సరిపోతాయి. ఇండియాలో ఫ్లాట్ పిచ్‌లపైనే బంతిని ఇరువైపులా స్వింగ్ చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఇక్కడ మైదానంలో పిచ్ నుంచి కొద్దిగా సహకారం లభించినా భువీ ఎంతో ప్రమాదకరంగా మారతాడు. ఆయనను ఎదుర్కోవడం మా బ్యాటర్లకు పెద్ద సవాలే" అని శాంట్నర్ వెల్లడిచారు.
సిరీస్‌లో బౌలర్లదే పైచేయి కానుందా?
వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఈ సిరీస్ లో బౌలర్ల ఆధిపత్యం పెరిగే అవకాశం ఉందని శాంట్నర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మొదటి మ్యాచ్‌లో పిచ్, తేమ ప్రభావం బౌలర్లకు కలిసి వస్తుందని, అయితే తర్వాతి మ్యాచ్‌లకు పిచ్ లు బ్యాటింగ్‌కు అనుకూలంగా మారవచ్చని ఆయన వివరించారు. అక్టోబర్ 22న క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 పోరు జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


