ఇది మాకు కొత్త కాదు.. అతని రాకతో మా బలం పెరిగింది: శ్రేయస్ అయ్యర్
తీరికలేని షెడ్యూల్, నిరంతర ప్రయాణాలు తమకు కొత్తకాదని టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఈ ఒత్తిడి తమపై పెద్దగా ప్రభావం చూపదని, జట్టు నిరంతర ప్రయాణాలకు అలవాటుపడిందన్నాడు.
న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన భారత ఐదు టీ20ల సిరీస్‌కు సిద్దమైంది. క్రైస్ట్ చర్చ్ వేదికగా మరికాసేపట్లో ప్రారంభమయ్యే తొలి టీ20తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. అయితే న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన 48 గంటల వ్యవధిలోనే మ్యాచ్ ఉండటంతో ఈ హడావుడి షెడ్యూల్‌పై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కానీ కెప్టెన్ అయ్యర్ మాత్రం ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశాడు.

తొలి టీ20 నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన అతను.. భువనేశ్వర్ రాకతో తమ జట్టు బలం రెట్టింపు అయ్యిందన్నాడు. 'గతంలో కూడా మేం ఇలా తీరిక లేని షెడ్యూల్‌తో ఆడిన సందర్భాలున్నాయి. ప్రయాణించడం.. ఆ వెంటనే మ్యాచ్ ఆడటం.. అక్కడి కండిషన్స్‌కు అలవాటు పడటం మాకు కొత్త కాదు. ఇది చాలా సరదాగా ఉంటుంది.
ప్రయాణ ఒత్తిడి గురించి పట్టించుకోకుండా మ్యాచ్ గెలవడంపై ఫోకస్ పెట్టాం. ఇక భువనేశ్వర్ కుమార్ అనుభవం జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పటి వరకు బౌలింగ్‌లో అనుభవలేమి కనిపించింది. అతని రాకతో జట్టు బలం రెట్టింపు అయ్యింది. గత రెండేళ్లలో ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాడు. టీ20 ఫార్మాట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు.'అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
ఇరు దేశాల మధ్య దౌత్య అవసరాలు, వాణిజ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సిరీస్‌లు షెడ్యూల్ చేస్తుండటం ఆటగాళ్లకు సమస్యగా మారింది. 43 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో భారత్ ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది.
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వకపోవడంపై శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. అతను వేచి చూడక తప్పదన్నాడు. 'వైభవ్ సూర్యవంశీ లాంటి టాలెంటెడ్ ప్లేయర్ డ్రెస్సింగ్ రూమ్‌లో సంతోషంగా ఉండటం ముఖ్యం. వయసులో అతను చాలా చిన్నవాడు. అవకాశాలు రావడానికి అతనికి చాలా సమయం ఉంది. మా ఓపెనర్లు నిలకడగా పరుగులు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచకప్ గెలిచిన జట్టులో భాగంగా ఉన్నారు. కాబట్టి, వైభవ్‌ను నేరుగా ఆడించలేం.
'నీకు కచ్చితంగా అవకాశం వస్తుంది. నీ దినచర్యను కొనసాగించారు. కొన్నిసార్లు వేచి చూడక తప్పదు'అని నేను వైభవ్‌కు చెబుతూ ఉంటాను'అని అయ్యర్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


