బౌలర్లు బాధితులు కాదు.. నాపై నాకు అంచనాలు లేవు: భువనేశ్వర్ కుమార్
ఆధునిక క్రికెట్‌లో బౌలర్లను బాధితులుగా చూస్తున్నారని, అది ఏ మాత్రం నిజం కాదని టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. గేమ్‌ను నడిపించేదే బౌలర్లని స్పష్టం చేశాడు. ఆటలో చాలా మార్పు వచ్చిందని అంగీకరించాడు. తనపై తనకు ఎలాంటి అంచనాలు లేవని, ఈ ఆలోచన విధానమే తనను నడిపించిందన్నాడు.
నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భువనేశ్వర్ కుమార్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఆడిన భువనేశ్వర్ కుమార్.. రెండో మ్యాచ్‌కు ముందు బీసీసీఐ టీవీతో మాట్లాడాడు. దేశం తరఫున ఆడటం కంటే గొప్ప గౌరవం మరొకటి ఉందని, ఈ అవకాశం మళ్లీ లభించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు.
నాపై నాకు అంచనాలు లేవు..
'నాపై నాకు ఎలాంటి అంచనాలు లేవు. గత 3-4 ఏళ్లు ఈ ఆలోచనా విధానం నాకు బాగా ఉపయోగపడింది. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వర్తమానంపై మాత్రమే దృష్టి పెడతాను. భారత జట్టుకు ఆడని సమయంలో నేను ఒక వ్యక్తిగా చాలా పరిణతి చెందాను. ఈ నాలుగేళ్లలో నేను ఏ రోజు టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించలేదు. నిజం చెప్పాలంటే ఈ నాలుగేళ్లు ఎలా గడిచాయో కూడా నాకు తెలియదు. నాలో చాలా మార్పు వచ్చింది, అందుకు ఐపీఎలే ప్రధాన కారణం.

గత రెండు ఐపీఎల్ సీజన్లలో కూడా ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగాను. కానీ పూర్తిగా సన్నదమయ్యాను. ఫిట్‌నెస్, నైపుణ్యాలు, మానసిక బలాన్ని పెంచుకోవడానికి కావాల్సినవన్నీ చేశాను. బౌలర్‌గా జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించాను. కానీ నేను ఇలా రాణిస్తానని, రెండు టైటిల్స్ గెలవడంతో భాగమవుతానని అస్సలు అనుకోలేదు.
బౌలర్లు బాధితులు కాదు..
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా బ్యాటర్ల ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. తొలి బంతి నుంచే భారీ షాట్స్ ఆడుతున్నారు. ఆధునిక క్రికెట్ బౌలర్లను బాధితులుగానే చూస్తున్నారు. కానీ ఇది ఏ మాత్రం నిజం కాదు. ఒక బౌలర్ గేమ్‌ను కంట్రోల్ చేయగలడు. బ్యాటర్ ఎటువైపు షాట్ ఆడాలో కూడా డిసైడ్ చేయగలడు. కాబట్టి ఇదంతా మనం చూసే కోణాన్ని బట్టే ఉంటుంది. బౌలర్లు చేయాల్సిందల్లా ఒక బౌలర్‌గా ఆలోచించడమే.
గత నాలుగేళ్లలో క్రికెట్ చాలా మారింది. కేవలం లీగ్ క్రికెట్ మాత్రమే కాదు. అంతర్జాతీయ క్రికెట్ కూడా పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు బ్యాటర్లు పరుగులు చేస్తున్న తీరు చూస్తే.. 200 పరుగులు కూడా చాలా సాధారణ స్కోర్‌గా మారిపోయింది. 200 ప్లస్ చేస్తేనే విలువ ఉంటుంది.'అని భువనేశ్వర్ కుమార్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


