IND vs NZ: నిప్పులు చెరిగిన బౌలర్లు.. భారత్ ముందు ఈజీ టార్గెట్!
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. దాంతో భారత్ ముందు న్యూజిలాండ్ 181 పరుగుల సాధారణ లక్ష్యాన్నే నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. గ్లేన్ ఫిలిప్స్(43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70), బెవాన్ జాకబ్స్(46 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 58) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(2/33) రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్(1/50), ప్రిన్స్ యాదవ్(1/30), నితీష్ కుమార్ రెడ్డి(1/31)తలో వికెట్ పడగొట్టారు. స్పిన్నర్లు నమన్ ధీర్, అక్షర్ పటేల్ వికెట్లు తీయకపోయినా.. కట్టడిగా బౌలింగ్ చేశారు.

ఆచితూచిన ఆడిన కివీస్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో టీమ్ సీఫెర్ట్(7).. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్(6) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగారు. ఈ రెండు క్యాచ్‌లను తిలక్ వర్మ అందుకోవడం గమనార్హం. ఆచితూచి ఆడిన ఫిన్ అలెన్(16)ను ప్రిన్స్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో న్యూజిలాండ్ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయి 43 పరుగులే చేసింది.
ఈ పరిస్థితుల్లో గ్లేన్ ఫిలిప్స్, బెవాన్ జాకోబ్స్ న్యూజిలాండ్‌ను ఆదుకున్నారు. పిచ్ బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉండటం.. బంతి ఆగి రావడంతో ఆచితూచి బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో ఫిలిప్స్ 33 బంతుల్లో , బెవాన్ జాకోబ్స్ 40 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 116 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడిని అర్ష్‌దీప్ సింగ్ విడదీసాడు. ఫిలిప్స్‌ను అర్ష్‌దీప్ క్యాచ్ ఔట్ చేయగా.. బెవాన్ జాకబ్స్‌ను నితీష్ రెడ్డి పెవిలియన్ చేర్చాడు. మైఖేల్ బ్రేస్‌వెల్ ఓ సిక్సర్‌తో పాటు బౌండరీ బాదడంతో న్యూజిలాండ్ 180 పరుగులు చేయగలిగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


