Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వారెవ్వా అర్ష్‌దీప్ సింగ్.. వాటే స్పాంటేనిటీ! బిత్తరపోయిన బెవాన్ జాకబ్స్!(వీడియో)

టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్‌తో ఆకట్టుకున్నాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో అర్ష్‌దీప్ సింగ్ తన స్పాంటేనిటీతో ఔరా అనిపించాడు. అతని అద్భుతమైన స్పందనకు న్యూజిలాండ్ బ్యాటర్ బెవాన్ జాకబ్స్ బిత్తరపోయాడు. ప్రస్తుతం ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. అర్ష్‌దీప్ సింగ్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

IND vs NZ: గ్లేన్ ఫిలిప్స్ విధ్వంసం.. భారత్ ‌ముందు భారీ లక్ష్యం!

IND vs NZ: గ్లేన్ ఫిలిప్స్ విధ్వంసం.. భారత్ ‌ముందు భారీ లక్ష్యం!

అసలేం జరిగిందంటే..?

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ మూడో బంతిని అర్ష్‌దీప్ సింగ్ యార్కర్‌గా సంధించగా.. గ్లేన్ ఫిలిప్స్ డిఫెన్స్ చేసి క్విక్ సింగిల్‌కు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని పసిగట్టిన అర్ష్‌దీప్ సింగ్ ఫాలో త్రూ రన్నప్‌లోనే వేగంగా పరుగెత్తి బంతిని వికెట్లపైకి తన్నాడు. ఈ అనూహ్య పరిణామంతో నాన్‌ స్ట్రైకర్ బెవాన్ జాకబ్స్ రనౌట్‌గా వెనుదిరిగాడు. అర్ష్‌దీప్ సింగ్ సమయస్ఫూర్తితో వ్యవహరించి రనౌట్ చేశాడు. 'వారెవ్వా అర్ష్‌దీప్ సింగ్.. వాటే స్పాంటేనిటీ'అని నెటిజన్లు కొనియాడుతున్నారు.

Fans Hail Arshdeep Singh s Spontaneous Run-Out of Bevon Jacobs as Video Goes Viral

గ్లేన్ ఫిలిప్స్ విధ్వంసం

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 225 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్(40 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. ఫిన్ అలెన్(24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), బెవాన్ జాకోబ్స్(16 బంతుల్లో 3 ఫోర్లతో 31) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.

అందుకే తుది జట్టు‌లో రెండు మార్పులు చేశాం: శ్రేయస్ అయ్యర్

Also Read

అందుకే తుది జట్టు‌లో రెండు మార్పులు చేశాం: శ్రేయస్ అయ్యర్

అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 230 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. సంజూ శాంసన్(33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించగా.. శ్రేయస్ అయ్యర్(28 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 42), అభిషేక్ శర్మ(12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 29) దూకుడుగా ఆడారు. న్యూజిలాండ్ బౌలర్లలో మైఖేల్ బ్రేస్ వెల్, మిచెల్ సాంట్నర్ రెండేసి వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, ఆడమ్ మిల్నే చెరో వికెట్ పడగొట్టారు.

Story first published: Thursday, October 22, 2026, 15:31 [IST]
Other articles published on Oct 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+