Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం!

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో న్యూజిలాండ్ 199 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. చివర్లో భారత బౌలర్లు కట్టడి బౌలింగ్ చేయడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగులు చేసింది. డారిల్ మిచెల్(52 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 89 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఫిన్ అలెన్(25 బంతుల్లో 5 సిక్స్‌లతో 40), బెవాన్ జాకబ్స్(23 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39 నాటౌట్) దూకుడుగా ఆడారు.

IND vs NZ: ఆ మెచ్యూరిటీ మా ఆటగాళ్లకు ఉంది: శ్రేయస్ అయ్యర్

IND vs NZ: ఆ మెచ్యూరిటీ మా ఆటగాళ్లకు ఉంది: శ్రేయస్ అయ్యర్

భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ చెరో వికెట్ తీసారు. ఈ మైదానంలో ఇది మంచి స్కోరే. అంతేకాకుండా ఈ మైదానంలో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువ విజయాలు సాధించాయి.

IND vs NZ Daryl Mitchell Unbeaten 89 Powers New Zealand to 198 3 Against India in 3rd T20I

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు అర్ష్‌దీప్ సింగ్ ఆరంభంలోనే షాకిచ్చాడు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే టీమ్ సీఫెర్ట్(2)‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అయితే క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్‌తో కలిసి ఫిన్ అలెన్ చెలరేగాడు. భారీ సిక్స్‌లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దాంతో పవర్ ప్లేలో న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ కూడా బ్యాట్ ఝులిపించడంతో న్యూజిలాండ్ స్కోర్ బోర్డు పరుగెత్తింది.

IND vs NZ: బ్యాడ్‌లైట్‌తో బచాయించిన న్యూజిలాండ్.. తృటిలో చేజారిన భారత్ విజయం!

Also Read

IND vs NZ: బ్యాడ్‌లైట్‌తో బచాయించిన న్యూజిలాండ్.. తృటిలో చేజారిన భారత్ విజయం!

ప్రమాదకరంగా మారిన ఈ జోడీని నితీష్ రెడ్డి విడదీసాడు. ఫిన్ అలెన్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 86 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఫిలిప్స్ సాయంతో మిచెల్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 3 బౌండరీలతో దూకుడు కనబర్చిన ఫిలిప్స్‌(17)ను అక్షర్ పటేల్ రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. బెవాన్ జాకబ్స్‌తో కలిసి డారిల్ మిచెల్ దూకుడుగా ఆడాడు. అయితే ఆఖరి ఓవర్‌ను ప్రిన్స్ యాదవ్ కట్టడిగా వేసి 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో న్యూజిలాండ్ స్కోర్ 200 పరుగుల మార్క్ అందుకోలేకపోయింది. ఓ దశలో న్యూజిలాండ్ 220 ప్లస్ రన్స్ చేసేలా కనిపించింది. కానీ భారత బౌలర్లు పుంజుకొని పరుగులు నియంత్రించారు.

Story first published: Tuesday, October 27, 2026, 14:21 [IST]
Other articles published on Oct 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+