Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది బుడ్డోడి అసలు సినిమా: అశ్విన్

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అంతర్జాతీయ వేదికపై తొలి మ్యాచ్ ఆడుతున్నాననే బెరుకు లేకుండా చెలరేగాడని కొనియాడాడు. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ బౌలింగ్‌లో సిక్సర్లు బాదిన తీరు అద్భుతమని ప్రశంసించాడు.

ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా శనివారం మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20తో వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అతిపిన్న భారత ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు.

ఈ క్రమంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 37 ఏళ్ల రికార్డ్‌ను 15 ఏళ్ల వైభవ్ బద్దలు కొట్టాడు. అయితే తన అరంగేట్రాన్ని వైభవ్ ఘనంగా మార్చుకోలేకపోయాడు. 10 బంతుల్లో 2 సిక్స్‌లతో 14 పరుగులే చేసి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. కానీ క్రీజులో ఉన్నంత సేపు ఫియర్‌లెస్ గేమ్‌తో ఆకట్టుకున్నాడు.

Just a Trailer of What s to Come R Ashwin Lavishes Praise on Prodigy Vaibhav Sooryavanshi for Dominating Jofra Archer

బుడ్డోడి బ్యాటింగ్ బాగా నచ్చింది..

తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ గురించి మాట్లాడిన అశ్విన్.. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని, బడ్డోడి అసలు సినిమా ముందుందని చెప్పుకొచ్చాడు. 'జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ బౌలింగ్‌లో వైభవ్ సూర్యవంశీ వేగంగా ఆడటం నాకు బాగా నచ్చింది. వైభవ్ తన ఫియర్‌లెస్ ఇంటెంట్‌ను ట్రైలర్‌లోనే చూపించాడు. అంతర్జాతీయ వేదికపై తొలి మ్యాచ్ ఆడుతున్నాననే బెరుకు లేకుండా ఆడాడు. అతని ఫేస్‌లో ఎలాంటి భయం, ఒత్తిడి కనిపించలేదు.

అతను దూకుడుగా ఆడేందుకు మాత్రమే జట్టులో ఉన్నాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ కుర్రాడు ఇప్పుడే తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. కెరీర్‌లో సుదీర్ఘమైన ప్రయాణం ఎలా చేస్తాడో చూడాలి. అయితే చాలా కాలం పాటు ఆడే సత్తా అతనికి ఉంది. వైభవ్ సూర్యవంశీని ఎవరితోనూ పోల్చొద్దు. ఫస్ట్ వైభవ్ సూర్యవంశీగానే ఉండనివ్వండి. అంతేకానీ రెండో బ్రాడ్‌మన్, సచిన్ అంటూ అతి చేయవద్దు. అతని ప్రయాణాన్ని చూద్దం. నిరంతం నేర్చుకుంటూ ముందుకు సాగాలని కోరుకుందాం.

ఒటములకు దిగులు చెందాల్సిన పనిలేదు..

ఐసీసీ టీ20 ప్రపంచకప్ లాస్ ఎంజెలెస్ ఒలింపిక్స్‌కు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఇప్పుడీ వైఫల్యాల గురించి ఏ మాత్రం దిగులుపడాల్సిన అవసరం లేదు. నెగెటివిటీ చాలా వేగంగా సర్యులేట్ అవుతుంది. ఇప్పుడు జట్టులో ఉన్న ప్లేయర్లకు చాలా సమయం ఉంది. ఎవరైనా వైఫల్యం చూడకుండా సక్సెస్ కాలేరు. సీనియర్లు ఒక్కొక్కరు వెళ్లి పోయిన తర్వాత.. యువ ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. వైఫల్యాలను స్వీకరించలేకపోతే... భవిష్యత్తులో స్టార్ క్రికెటర్లుగా ఎదగలేరు.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయిన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా.. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో కూడా 0-1తో వెనుకంజలో నిలిచింది. తొలి టీ20 వర్ఫార్పణం కాగా రెండో టీ20లో రవి బిష్ణోయ్ చెత్త బౌలింగ్‌తో ఓటమిపాలైంది. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 మంగళవారం రాత్రి 10 గంటలకు జరగనుంది. వరుస పరాజయాలతో నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై ఒత్తిడి పెరుగుతోంది.

Story first published: Monday, July 6, 2026, 18:09 [IST]
Other articles published on Jul 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+