Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: మళ్లీ విఫలమైన వైభవ్ సూర్యవంశీ.. అదే చెత్త షాట్! (వీడియో)

ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ పేలవ ఫామ్‌ కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ వైభవ్ తీవ్రంగా నిరాశపర్చాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 15 పరుగులే చేసి వెనుదిరిగాడు. మళ్లీ అదే చెత్త షాట్‌తో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. మూడో టీ20 తరహాలోనే షార్ట్ పిచ్ డెలివరీతో వైభవ్‌ను ఆర్చర్ బోల్తా కొట్టించాడు.

నేనైతే అతను 10 మ్యాచ్‌ల్లో విఫలమైనా ఆడిస్తాను: మహమ్మద్ కైఫ్

నేనైతే అతను 10 మ్యాచ్‌ల్లో విఫలమైనా ఆడిస్తాను: మహమ్మద్ కైఫ్

ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగగా.. ఆర్చర్ వేసిన తొలి ఓవర్‌ను వైభవ్ ఆచితూచి ఆడాడు. జోష్ టంగ్ వేసిన రెండో ఓవర్‌లో మాత్రం వరుసగా 4, 6 బాది జోరు కనబర్చాడు. కానీ ఆర్చర్ వేసిన మూడో ఓవర్‌లో మాత్రం పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డాడు.

IND vs ENG 4th T20I Vaibhav Sooryavanshi Flops in Bristol T20I After Jofra Archer Traps Him with Short-Ball

నాలుగో బంతిని ఆర్చర్.. షార్ట్ పిచ్ డెలివరీగా వేయగా.. టెంప్ట్ అయిన వైభవ్ పుల్ షాట్ ఆడబోయాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి మిడాన్ దిశగా గాల్లోకి లేవగా.. సామ్ కరణ్ అందుకున్నాడు. దాంతో వైభవ్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వైభవ్ వరుసగా రెండో సారి ఔటవ్వడం గమనార్హం.

భారీ అంచనాలతో బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో తీవ్రంగా నిరాశపర్చాడు. మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన వైభవ్.. ఆ మ్యాచ్‌లో 14 పరుగులే చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. మూడో టీ20లో 13 పరుగులు చేసి ఆర్చర్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. తాజా మ్యాచ్‌లో 15 పరుగులకే పరిమితమయ్యాడు. ఇంగ్లండ్ కండిషన్స్‌కు తగ్గట్లు ఆడలేక వైభవ్ మూల్యం చెల్లించుకున్నాడు.

IND vs ENG: టీమిండియా అసలు సమస్య అదే!

IND vs ENG: టీమిండియా అసలు సమస్య అదే!

వైభవ్ సూర్యవంశీతో పాటు ఇషాన్ కిషన్(4), అభి షేక్ శర్మ(16) కూడా తీవ్రంగా నిరాశపర్చారు. జోష్ టంగ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ క్యాచ్ ఔటవ్వగా.. అభిషేక్ శర్మ(16)ను ఆదిల్ రషీద్ రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

Story first published: Thursday, July 9, 2026, 22:47 [IST]
Other articles published on Jul 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+