IND vs ENG: రఫ్ఫాడించిన అక్షర్ పటేల్.. కుప్పకూలిన ఇంగ్లండ్!
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు దుమ్ము రేపారు. అక్షర్ పటేల్(4/62) నాలుగు వికెట్లతో సత్తా చాటడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకే ఆలౌటైంది. జోరూట్(76 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 76 నాటౌట్), లియామ్ డాసన్(83 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 68) హాఫ్ సెంచరీలతో రాణించారు.
బెన్ డకెట్(45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్‌తో పాటు ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ రెండేసి వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా, శివమ్ దూబే తలో వికెట్ పడగొట్టారు.

నిప్పులు చెరిగిన బుమ్రా..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను జస్‌ప్రీత్ బుమ్రా ముప్పుతిప్పలు పెట్టాడు. బుమ్రా బౌలింగ్‌ను ఆచితూచి ఆడిన ఓపెనర్లు బెన్ డకెట్, జాకోబ్ బెతెల్ తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించారు. బెతెల్ ఇబ్బంది పడినా.. డకెట్ భారీ షాట్లు ఆడాడు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని గుర్నూర్ బ్రార్ విడదీసాడు.
ఇద్దర్ని ఒకే ఓవర్‌లో పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే కెప్టెన్ హ్యారీ బ్రూక్(1)ను జస్‌ప్రీత్ బుమ్రా స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చగా.. జోస్ బట్లర్(5), సామ్ కరణ్(0)లను ప్రసిధ్ కృష్ణ ఒకే ఓవర్‌లోఔట్ చేశాడు. దాంతో ఇంగ్లండ్ 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆదుకున్న జోరూట్..
జోరూట్‌తో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసిన విల్ జాక్స్(20)ను శివమ్ దూబే కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 107 పరుగులకే ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా సాగింది. కానీ జోరూట్, లియామ్ డాసన్ అద్వితీయమైన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగి 8వ వికెట్‌కు 111 పరుగుల జోడించారు.
ఈ భాగస్వామ్యాన్ని అక్షర్ పటేల్ విడదీసాడు. లియామ్ డాసన్(68)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. తన మరుసటి ఓవర్లలో ఆర్చర్(12), ఆదిల్ రషీద్(1), జోష్ టంగ్(0)లను పెవిలియన్ చేర్చి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

