Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: ఆ గుండె కోత తర్వాత 969 రోజులకు..! (వీడియో)

ఆస్ట్రేలియాతో 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తర్వాత టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వన్డే ఫార్మాట్ ఆడాడు. 969 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్‌లోకి పునరాగమనం చేశాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో బుమ్రా బరిలోకి దిగాడు. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై బుమ్రా నిప్పులు చెరిగాడు. తనకే సాధ్యమైన స్వింగ్, యార్కర్లతో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.

IND vs ENG: టాస్ ఓడిన భారత్! మ్యాచ్ విన్నర్‌‌పై వేటు.. ఆ దద్దమ్మకు చోటు!

IND vs ENG: టాస్ ఓడిన భారత్! మ్యాచ్ విన్నర్‌‌పై వేటు.. ఆ దద్దమ్మకు చోటు!

టీ20 సిరీస్‌లో బలహీనమైన భారత బౌలింగ్‌పై విరుచుకుపడిన ఇంగ్లండ్ బ్యాటింగ్ దళం.. బుమ్రా ధాటికి తొలి వన్డేలో తోక ముడిచింది. బుమ్రా రాకనో లేక అతని నాయకత్వమో ఏమో తెలియదు కానీ ఇతర బౌలర్లు కూడా ఈ మ్యాచ్‌లో నిప్పులు చెరిగారు.

IND vs ENG Jasprit Bumrah Ends 969-Day Wait With Game-Changing Performance After 2023 WC Final Heartbreak

ఆ గుండె కోత తర్వాత...

అహ్మదాబాద్ వేదికగా 2023 నవంబర్ 19న ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ ఆడిన బుమ్రా.. ఆ తర్వాత పూర్తిగా వన్డే ఫార్మాట్‌కు దూరంగా ఉన్నాడు. ఆ టోర్నీలో అజేయంగా ఫైనల్ చేరిన భారత్.. ఫైనల్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. ఆ ఓటమి ఇప్పటికీ భారత అభిమానులను వెంటాడుతోంది.

మళ్లీ గంభీర్ X కోహ్లీ డిష్యూం డిష్యూం? (వీడియో)

మళ్లీ గంభీర్ X కోహ్లీ డిష్యూం డిష్యూం? (వీడియో)

ఆ గుండె కోత అనంతరం దాదాపు మూడేళ్ల పాటు బుమ్రా వన్డే ఫార్మాట్‌కు దూరంగా ఉన్నాడు. గాయాలు, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్, టీ20 ప్రపంచకప్ 2024, 2026 నేపథ్యంలో బీసీసీఐ.. బుమ్రాను వన్డే ఫార్మాట్‌కు దూరంగా ఉంచింది. వన్డే ప్రపంచకప్ 2027 నేపథ్యంలో మళ్లీ అతన్ని ఈ ఫార్మాట్‌లో ఆడిస్తోంది.

IND vs ENG: గెలికి మరీ తన్నించుకోవడం అంటే ఇదే బ్రో! (వీడియో)

IND vs ENG: గెలికి మరీ తన్నించుకోవడం అంటే ఇదే బ్రో! (వీడియో)

150 వికెట్ల క్లబ్‌లో బుమ్రా..

ప్రపంచకప్ ఫైనల్లో 149 వన్డే వికెట్ల వద్ద ఆగిపోయిన బుమ్రా.. 969 రోజుల తర్వాత 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్(1)ను ఔట్ చేసి మరీ బుమ్రా ఈ ఫీట్ సాధించాడు. బుమ్రా సారథ్యంలోని భారత పేస్ విభాగం ఈ మ్యాచ్‌లో నిప్పులు చెరిగింది.

ఆరంభంలోనే ఇంగ్లండ్ ఓపెనర్ల‌ను బుమ్రా ఇబ్బంది పెట్టి ఒత్తిడి పెంచగా.. గుర్నూర్ బ్రార్, ప్రసిధ్ కృష్ణ వరుసగా ఒకే ఓవర్‌లో రెండేసి వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాటింగ్ నడ్డి విరిచారు. శివమ్ దూబే కూడా ఒక వికెట్ తీయడంతో 107 పరుగులకే ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయి ఆలౌట్‌ దిశగా సాగుతుంది.

Story first published: Tuesday, July 14, 2026, 17:45 [IST]
Other articles published on Jul 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+