IND vs ENG: టాస్ ఓడిన భారత్! మ్యాచ్ విన్నర్‌పై వేటు.. ఆ దద్దమ్మకు చోటు!
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాస్ ఓడి బౌలింగ్‌కు దిగింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే టాస్ ఓడినా తాము కోరుకున్నదే లభించిందని టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు.
'టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నాం. ఇతర ఆటగాళ్లు టీ20లు ఆడటంతో మా జట్టులో చాలా మందికి విశ్రాంతి లభించింది. నాకు ప్రాక్టీస్ చేసే సమయం దొరికింది. రెండు రోజుల ముందే ఇక్కడికి చేరుకున్నాం. ఇక్కడి వాతావరణానికి తగ్గట్లు సన్నదమయ్యాం. 2027 వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ఈ సిరీస్ మాకు ముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడి పరిస్థితులు సౌతాఫ్రికా పిచ్‌లకు దగ్గరగా ఉంటాయి.
కొత్తవాళ్లను పరీక్షిస్తాం..
ఈ కోణంలోనే పలు కాంబినేషన్స్‌ను ప్రయత్నించాలనుకుంటున్నాం. అలాగే ఈ ఫార్మాట్‌లో అనుభవం లేని ఆటగాళ్లకు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. విరాట్, రోహిత్, కేఎల్ రాహుల్, బుమ్రా రీఎంట్రీతో జట్టు బలం పెరిగింది. వారి అనుభవం ఎంతగానో ఉపయోగపడనుంది.

ఈ సిరీస్ కోసం నేను చాలా ఉత్సాహంగా ఉన్నా. కెప్టెన్‌గా ఈ గడ్డపై నాకు అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ జ్ఞాపకాలకు మరిన్ని మంచి క్షణాలను జోడిస్తామని ఆశిస్తున్నా. రెగ్యులర్ కాంబినేషన్‌తో ఆడుతున్నాం. శివమ్ దూబేతో కలిసి నలుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌తో బరిలోకి దిగుతున్నాం.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్ డెప్త్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఉద్వాసనకు గురయ్యాడు. సుందర్‌ను పక్కన పెట్టాలని క్రికెట్ విశ్లేషకులు సూచించినా గంభీర్ పట్టించుకోలేదు.
స్పిన్‌కు అనుకూలంగా..
మరోవైపు పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తెలిపాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. అయితే మ్యాచ్ సాగే కొద్దీ పిచ్ ఎలా స్పందిస్తుందో తెలియదు. కానీ ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేయాలనుకుంటున్నాం. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లకు అడ్వాంటేజ్‌గా ఉండొచ్చు.
టీ20 సిరీస్ తరహాలోనే ఇక్కడ కూడా పూర్తి ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నాం. వీలైనంత త్వరగా పిచ్ కండిషన్స్‌ను అంచనా వేసి అందుకు తగ్గట్లు ఆడాలనుకుంటున్నాం. టీ20 కాంబినేషన్‌నే వన్డేల్లో కొనసాగిస్తున్నాం. కెప్టెన్‌గా మా ఆటగాళ్లపై పూర్తి నమ్మకం ఉంది. భారత్‌కు గట్టి పోటీనిస్తామని ఆశిస్తున్నా. గత రెండేళ్లుగా వన్డేల్లో మేం నిలకడైన ప్రదర్శన చేయలేదు. కానీ ఇక నుంచి రాణించాలనుకుంటున్నాం. మేం ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతున్నాం.'అని హ్యారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
ఇంగ్లండ్: జాకోబ్ బెథెల్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కరన్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్.
భారత్:రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

