Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంభీర్, అయ్యర్‌ను కాదు.. ఆ అరడజను దొంగలను తరిమేయండి: సంజయ్ మంజ్రేకర్

ఐర్లాండ్‌తో పాటు ఇంగ్లండ్ పర్యటనల్లో టీమిండియా ఒక్క విజయం సాధించలేకపోయింది. ఈ రెండు సిరీస్‌ల్లో క్లీన్ స్వీప్ అయిన టీమిండియా.. ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పసికూన ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో 2-0తో ఓడిన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా.. ఇంగ్లండ్ గడ్డపై ఐదు టీ20ల సిరీస్‌ను 4-0తో ఓటమిపాలైంది. దాంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు శ్రేయస్ అయ్యర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ ఇద్దరిపై వేటు వేయాలనే డిమాండ్లు కూడా వినిపించాయి.

తాజాగా టీమిండియా వైఫల్యంపై స్పందించిన మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌ బీసీసీఐకి కీలక సలహా ఇచ్చాడు. భారత పరాజయాల వెనుక ఉన్న అసలు సమస్యను గుర్తించాలని సూచించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మంజ్రేకర్ ఓ వీడియోను షేర్ చేశాడు.

Sanjay Manjrekar Urges BCCI to Back Gautam Gambhir and Shreyas Iyer Despite T20I Series Loss vs England

వారి ఉద్యోగాలు పీకేయాలి..

'ఐర్లాండ్, ఇంగ్లండ్‌ పర్యటనల్లో భారత ఘోర పరాజయాల నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌‌తో పాటు ఆటగాళ్లపై వేటు వేయడం సులువు. కానీ అది సరైన పరిష్కారం కాదు. ఈ ఓటములకు అసలు కారణాన్ని కనుక్కోవాలి. మన ఆటగాళ్లు విదేశీ పిచ్‌లకు సరిగ్గా సిద్ధం కాలేదు. దీనికి ప్రధాన కారణం సెలెక్షన్ కమిటీ. కేవలం ఐపీఎల్ ప్రదర్శనను చూసి ఆటగాళ్లను ఎంపిక చేయడం వల్లే ఈ సమస్య తలెత్తింది.

IND vs ENG: బరిలో కోహ్లీ, రోహిత్, బుమ్రా.. ఇంగ్లండ్‌తో తొలి వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

IND vs ENG: బరిలో కోహ్లీ, రోహిత్, బుమ్రా.. ఇంగ్లండ్‌తో తొలి వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

ఐపీఎల్‌లో బ్యాటింగ్‌‌కు అనుకూలమైన పిచ్‌లను సిద్దం చేస్తున్నారు. అక్కడ బ్యాటింగ్ చేయడం చాలా సులువు. ప్రేక్షకుల ఆదరణ పొందేందుకు 200 ప్లస్ స్కోర్స్ వచ్చేలా పిచ్‌లు సిద్దం చేయాలని బీసీసీఐకి సలహా ఇచ్చిన వారిని ఉద్యోగాల నుంచి పీకేయాలి. అలాగే విదేశాల్లో మెరుగ్గా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి. 'అని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్ వల్లే..

ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో భారత్ ఓటమికి ఐపీఎల్ ప్రధాన కారణమని జోరుగా ప్రచారం జరుగుతుండగా.. సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు ఆ వాదనకు బలం చేకూరుస్తుంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో మైదానం మినహా అన్ని గ్రౌండ్స్‌లో పిచ్‌లన్నీ బ్యాటింగ్‌కు అనుకూలించాయి. దాంతో ప్రతీ జట్టు ఈజీగా 200 ప్లస్ స్కోర్లు నమోదు చేసింది. ఇది భారత జట్టు బ్యాటింగ్‌పై ప్రభావం చూపింది. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్లు, స్లోగా ఉన్న పిచ్‌లపై భారత బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. ముఖ్యంగా బౌన్స్, స్వింగ్ బౌలింగ్‌ను ఆడలేక మూల్యం చెల్లించుకుంటున్నారు.

వీళ్ల నుంచి కాదు.. అతన్ని టీ20ల్లోకి తీసుకోండి:క్రిష్ శ్రీకాంత్

వీళ్ల నుంచి కాదు.. అతన్ని టీ20ల్లోకి తీసుకోండి:క్రిష్ శ్రీకాంత్

మరోవైపు పిచ్ కండిషన్స్ సరిగ్గా అంచనా వేయకపోవడం వల్లే ఓటమిపాలయ్యామని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అయ్యర్ వరుసగా 7 మ్యాచ్‌ల్లో ఒక్క విజయాన్ని అందించలేకపోయాడు. ప్రస్తుతం వన్డే సిరీస్‌కు సన్నదమవుతున్న అయ్యర్.. అనంతరం జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్నాడు. అక్కడ జరిగే మూడు టీ20ల సిరీస్‌తో అయ్యర్ కెప్టెన్సీ భవితవ్యం తేలనుంది.

Story first published: Monday, July 13, 2026, 19:29 [IST]
Other articles published on Jul 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+