Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG 1st ODI: గంభీర్.. ఆ దద్దమ్మను పక్కన పెట్టు!

ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో చిత్తుగా ఓడిన టీమిండియా వన్డే సిరీస్‌కు సిద్దమైంది. నేడు(మంగళవారం) బర్మింగ్‌హామ్ వేదికగా జరిగే తొలి వన్డే‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. టీమిండియా సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగుతుండటంతో ఈ సిరీస్‌‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

IND vs ENG: ఆ తప్పిదాలే మా ఓటమిని శాసించాయి: ఇంగ్లండ్ కెప్టెన్

IND vs ENG: ఆ తప్పిదాలే మా ఓటమిని శాసించాయి: ఇంగ్లండ్ కెప్టెన్

శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టుకు ఎదురైన ఘోర పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా భావిస్తోంది. తొలి వన్డే‌లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యంలో నిలవాలనే పట్టుదలతో గిల్ సేన ఉంది. ఈ మ్యాచ్ కోసం ఆటగాళ్లంతా సిద్దమయ్యారు. ఇంగ్లండ్ కండిషన్స్‌‌ను అలవాటు చేసుకునేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు.

Cricket Experts Urge Gautam Gambhir to Leave Out Washington Sundar for India vs England 1st ODI

సుందర్ మాత్రం వద్దు..

అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాలంటే సరైన కాంబినేషన్‌ను ఎంచుకోవాలని, పిచ్ కండిషన్స్‌ను సరిగ్గా అంచనా వేయాలని విశ్లేషకులు గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని మేనేజ్‌మెంట్‌కు సూచిస్తున్నారు. ముఖ్యంగా జట్టుకు భారంగా మారిన వాషింగ్టన్ సుందర్‌ను అస్సలు జట్టులోకి తీసుకోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఐదు టీ20ల సిరీస్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన సుందర్ 5 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపర్చాడు. ఒకే ఒక ఓవర్ బౌలింగ్ చేసిన అతను 19 పరుగులు ఇచ్చుకున్నాడు. ఆల్‌రౌండర్ కోటాలో తుది జట్టులో చోటు దక్కించుకుంటున్న సుందర్.. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లోనూ రాణించలేకపోతున్నాడు.

గంభీర్, అయ్యర్‌ను కాదు.. ఆ అరడజను దొంగలను తరిమేయండి: సంజయ్ మంజ్రేకర్

గంభీర్, అయ్యర్‌ను కాదు.. ఆ అరడజను దొంగలను తరిమేయండి: సంజయ్ మంజ్రేకర్

జట్టులో ఉండటం దండుగ..

వాషింగ్టన్ సుందర్ కాళ్లు, చేతులు లేకుండా బ్యాటింగ్ చేస్తున్నాడని మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శించాడు. సుందర్ టెస్ట్‌లకు మాత్రమే పనికివస్తాడని తీర్పు ఇచ్చాడు. వాషింగ్టన్ సుందర్ అసలు జట్టులో ఎందుకు కొనసాగుతున్నాడో తనకు అర్థం కావడం లేదని టీమిండియా వెటరన్ బ్యాటర్ హనుమ విహారి అన్నాడు.

సుదీర్ఘ కాలంగా అతను రాణించిందేం లేదని విమర్శించాడు. కేవలం గంభీర్‌కు ఇష్టమైన ఆటగాడు కావడంతోనే సుందర్‌ జట్టులో కొనసాగుతున్నాడని విహారి తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా అభిప్రాయపడ్డాడు. శివమ్ దూబే, సూర్షాన్ షెడ్గేలు కూడా అలానే ఉన్నారని అసహనం వ్యక్తం చేశాడు.

సుందర్ బెంచ్‌కే..

ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా.. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. అక్షర్ పటేల్, శివమ్ దూబే ఆల్‌రౌండర్లుగా బరిలోకి దిగనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఆడనుండగా.. జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.

Story first published: Tuesday, July 14, 2026, 13:30 [IST]
Other articles published on Jul 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+