చరిత్ర సృష్టించిన షెఫాలీ వర్మ!
టీమిండియా ఓపెనర్ షెఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో సెమీఫైనల్లో షెఫాలీ వర్మ(40 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64) హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించింది.
ఈ క్రమంలో స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్‌లను షెఫాలీ వర్మ వెనక్కినెట్టింది. ఇప్పటి వరకు మహిళల ఆసియాకప్ టీ20 టోర్నీలో 20 ఇన్నింగ్స్‌లు ఆడిన షెఫాలీ వర్మ 593 పరుగులు చేసింది. 18 ఇన్నింగ్స్‌ల్లో స్మృతి మంధాన 590, హర్మన్‌ప్రీత్ కౌర్ 465, జెమీ రోడ్రిగ్స్ 345 పరుగులు చేశాడు. 17 ఇన్నింగ్స్‌ల్లో రిచా ఘోష్ 231 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు చేసింది. షె ఫాలీ వర్మ హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. హర్మన్‌ప్రీత్ కౌర్(24), రిచా ఘోష్(21), ప్రతికా రావల్(20) పర్వాలేదనిపించారు. స్మృతి మంధాన(2), దీప్తి శర్మ(13), భార్తి ఫుల్మాలి(0) తీవ్రంగా నిరాశపర్చారు. బంగ్లాదేశ్ బౌలర్లలో సుల్తాన ఖాటున్ రెండు వికెట్లు తీయగా.. మరుఫా అక్తర్, నహిదా అక్తర్, రబెయా ఖాన్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


