Womens Asia Cup 2026: భారత్ టైటిల్ గెలిచినా.. నో ట్రోఫీ! ఎందుకంటే..?
మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో మూడు మ్యాచ్‌లకు మూడు గెలిచిన భారత్.. గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచింది. గ్రూప్-బీ రన్నరప్‌తో సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-బీ రన్నరప్‌గా బంగ్లాదేశ్ నిలిచే అవకాశం ఉంది. అయితే ఆ జట్టుకు యూఏఈతో గట్టి పోటీ నెలకొంది. ఈ రెండు జట్ల మధ్య మంగళవారం జరిగే మ్యాచ్ ఫలితంతో భారత్ సెమీస్ ప్రత్యర్థి ఎవరో తేలిపోనుంది.
గత చరిత్ర చూసుకున్నా.. ఫామ్ పరిశీలించినా.. భారత్ టైటిల్ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. అయితే ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచినా.. ట్రోఫీ దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ.. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఛైర్మన్ హోదాలో ఫైనల్ మ్యాచ్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నాడు.
గతేడాది నఖ్వీ రసాభాస..
అతనే మహిళల ఆసియా కప్ 2026 విజేతకు ట్రోఫీ అందజేయనున్నాడు. ఈ విషయంపై అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ.. చీఫ్ గెస్ట్ మోహ్సిన్ నఖ్వీనే అంటూ వార్తలు హల్‌ఛల్ చేస్తున్నాయి. గతేడాది పురుషుల ఆసియా కప్ 2025 ఫైనల్ మోహ్సిన్ నఖ్వీ కారణంగా రసాభాసగా మారిన సంగతి తెలిపిందే. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన భారత్.. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు నిరాకరించింది.

మరోవైపు నఖ్వీ కూడా తనే ట్రోఫీని అందజేస్తానని పట్టుబట్టాడు. అంతేకాకుండా ట్రోఫీని తనవెంట తీసుకెళ్లిపోయాడు. దాంతో భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకున్నారు. ఇప్పటికీ ఆ ట్రోఫీ ఏసీసీ కార్యాలయంలోనే ఉంది. బీసీసీఐ ఎన్నిసార్లు డిమాండ్ చేసినా మోహ్సిన్ మాత్రం వెనక్కి తగ్గలేదు.
సెప్టెంబర్ 13న అదే సీన్ రిపీట్..
మహిళల ఆసియా కప్ ఫైనల్ అనంతరం కూడా ఇవే పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 13న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్ విజేతగా నిలిస్తే మాత్రం.. నఖ్వీ చేతుల మీదు టైటిల్ తీసుకోదు. అదే జరిగితే మరోసారి ట్రోఫీ లేకుండానే భారత్ విజేతగా స్వదేశానికి రావాల్సి ఉంటుంది.
ఏం జరుగుతుందో చూడాలి. భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్.. సెమీస్ బెర్త్ కోసం తండ్లాడుతోంది. నేడు (సోమవారం) హాంగ్‌కాంగ్‌తో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే పాక్ సెమీస్ చేరనుంది. లేదంటే ఇంటిబాట పడుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


