Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వారసులు వచ్చేసారు.. భారత జట్టులోకి సెహ్వాగ్, ద్రవిడ్ కొడుకులు!

భారత క్రికెట్‌ దిగ్గజాలు వీరేంద్ర సెహ్వాగ్‌, రాహుల్‌ ద్రవిడ్‌ వారసులు టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. జూనియర్ స్థాయిలో అదరగొడుతున్న ఆర్యవీర్ సెహ్వాగ్(Aaryavir Sehwag), అన్వయ్ ద్రవిడ్.. భారత అండర్ 19 టీమ్ పిలుపును అందుకున్నారు.

ఆస్ట్రేలియా‌తో సొంతగడ్డపై జరిగే మూడు యూత్ వన్డేల సిరీస్‌కు ఎంపిక చేసిన భారత అండర్‌-19 జట్టులో ఈ ఇద్దరు దిగ్గజాల కుమారులకు బీసీసీఐ అవకాశం కల్పించింది.

IND vs SL: టీమిండియాకు ఎదురుదెబ్బ.. భారీ లక్ష్యం దిశగా శ్రీలంక!

IND vs SL: టీమిండియాకు ఎదురుదెబ్బ.. భారీ లక్ష్యం దిశగా శ్రీలంక!

ఇరు జట్ల మధ్య సెప్టెంబర్‌ 18, 21, 23 తేదీల్లో రాజ్‌కోట్‌ వేదికగా ఈ మూడు యూత్ వన్డేల సిరీస్ జరగనుంది. ఆ తర్వాత నాలుగు రోజుల మ్యాచ్‌లు రెండు జరగనున్నాయి. సెప్టెంబర్‌ 27 నుంచి 30 వరకు రాజ్‌కోట్‌లో తొలి మ్యాచ్‌ జరగనుండగా.. అక్టోబర్‌ 5 నుంచి 8 వరకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం 'బి' గ్రౌండ్‌లో రెండో మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Aaryavir Sehwag Anvay Dravid Picked in India U19 Squad for Australia Series

వన్డే జట్టుకు లక్ష్య రైచందాని సారథిగా వ్యవహరించనుండగా.. యశ్‌వర్ధన్‌ చౌహాన్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉంటాడు. రెడ్‌బాల్‌ మ్యాచ్‌లకు చౌహాన్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. రైచందాని వైస్‌ కెప్టెన్‌గా కొనసాగుతాడు. ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రవిడ్‌కు రెడ్ బాల్ టీమ్‌లో చోటు దక్కలేదు.

ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ ప్రస్తుతం ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌లో వెస్ట్‌ ఢిల్లీ లయన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన అతను తన తండ్రి తరహా బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. అన్వయ్‌ ద్రవిడ్‌ ఇటీవల శ్రీలంక పర్యటనలో రెండు యూత్ వన్డేలు ఆడి 101 పరుగులు చేశాడు.

వన్డే జట్టు: లక్ష్య రాయచందానీ (సి), యశ్బర్ధన్ చౌహాన్ (విసి), రజత్ బాఘెల్ (డబ్ల్యుకె), ఆర్యవీర్ సెహ్వాగ్, వి.కె. వినీత్, కుశాగ్రా ఓజా, అర్జున్ రాజ్‌పుత్, మనల్ చౌహాన్, అన్వయ్ ద్రవిడ్ (కీపర్), V. యశ్వీర్, రోహిత్ యాదవ్, షావిన్ వినోద్, మోహిత్ ఉల్వా, చిగురుపాటి వెంకట, కావ్య పటేల్.

IND vs SL: పంత్, మానవ్ సుతార్ వ్యూహం.. చేజారిన పసిందు శతకం! (వీడియో)

Also Read

IND vs SL: పంత్, మానవ్ సుతార్ వ్యూహం.. చేజారిన పసిందు శతకం! (వీడియో)

మల్టీ-డే స్క్వాడ్: యశ్బర్ధన్ చౌహాన్ (సి), లక్ష్య రాయచందానీ (విసి), సాగర్ విర్క్, కుషాగ్రా ఓజా, మనల్ చౌహాన్, కుష్ పటేల్, మానవ్ కృష్ణ (డబ్ల్యుకె), అభిప్రయ్ బిస్వాస్ (డబ్ల్యుకె), రోహిత్ యాదవ్, ఇషాన్ ఓం, అయాన్ సింగ్ అక్రం, ప్రణవ్ అక్రమ్, ప్రణవ్ అక్రం, ప్రణవ్ సింగ్ ఆర్యన్ యాదవ్.

Story first published: Thursday, August 27, 2026, 14:28 [IST]
Other articles published on Aug 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+