Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: కొంపముంచిన శివమ్ దూబే.. భారత్ ముందు పోరాడే లక్ష్యం!

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు దుమ్మురేపారు. అర్ష్‌దీప్ సింగ్(3/19) తీన్మార్ బౌలింగ్‌తో సత్తా చాటగా.. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులు చేసింది.

అజ్మతుల్లా ఒమర్జాయ్(44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. మహమ్మద్ నబీ(27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

అందుకే వైభవ్ సూర్యవంశీని ఆడించడం లేదు: శ్రేయస్ అయ్యర్

అందుకే వైభవ్ సూర్యవంశీని ఆడించడం లేదు: శ్రేయస్ అయ్యర్

నిప్పులు చెరిగిన బౌలర్లు..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. బుమ్రా వేసిన తొలి ఓవర్‌ రెండో బంతికే ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్(0) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇబ్రహీం జడ్రాన్‌(11)ను అక్షర్ పటేల్ రనౌట్ చేయగా.. సెదిఖుల్లా అటల్(13)ను అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్ ఔట్ చేశాడు. గుల్బాదిన్ నైబ్(2)‌ను అక్షర్ పటేల్ ఔట్ చేయడంతో పవర్ ప్లేలోనే అఫ్గాన్ 4 వికెట్లు కోల్పోయి 41 పరుగులే చేసింది. ఆ వెంటనే డార్విష్ రసూలి(2)ని వరుణ్ చక్రవర్తీ క్లీన్ బౌల్డ్ చేయడంతో 43 పరుగలకే అఫ్గాన్ 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

IND vs AFG Shivam Dube Concedes 21 Runs in Final Over as Azmatullah Omarzai s 64 Lifts Afghanistan to 156 8

ఆదుకున్న ఒమర్జాయ్..

ఈ పరిస్థితుల్లో అజ్మతుల్లా ఒమర్జాయ్, మహమ్మద్ నబీ జట్టును ఆదుకున్నారు. ఆచితూచి ఆడిన ఈ జోడీ.. క్రీజులో సెట్ అయిన తర్వాత దూకుడుగా ఆడింది. 83 పరుగులతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని అర్ష్‌దీప్ సింగ్ విడదీసాడు. మహమ్మద్ నబీని క్లీన్ బౌల్డ్ చేశాడు. తన మరుసటి ఓవర్‌లో రషీద్ ఖాన్(1)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

IND vs AFG: బుడ్డోడిని పక్కనపెట్టేందుకు బుద్దుండాలి.. సబ్‌స్క్రిప్షన్ బొక్క!

Also Read

IND vs AFG: బుడ్డోడిని పక్కనపెట్టేందుకు బుద్దుండాలి.. సబ్‌స్క్రిప్షన్ బొక్క!

నూర్ అహ్మద్‌ను శ్రేయస్ అయ్యర్ రనౌట్ చేయగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్(9 నాటౌట్)తో కలిసి ఒమర్జాయ్ దూకుడుగా ఆడి జట్టు స్కోర్‌ను 150 పరుగుల మార్క్‌ను ధాటించాడు. ఆఖరి ఓవర్‌ను శివమ్ దూబేతో వేయించి శ్రేయస్ అయ్యర్ ఘోర తప్పిదం చేశాడు. శివమ్ దూబే బౌలింగ్‌లో అఫ్గాన్ బ్యాటర్లు ఒమర్జాయ్, ముజీబ్ వరుసగా 6, 6, 1, 4, 4 బాది 21 పరుగులు పిండుకున్నారు. ఈ ఓవర్ కట్టడిగా వేసి ఉంటే అఫ్గాన్ 130 పరుగుల లోపే పరిమితమయ్యేది.

Story first published: Sunday, September 13, 2026, 21:33 [IST]
Other articles published on Sep 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+