For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జడేజా కళ్లు చెదిరే క్యాచ్.. సూపరో సూపర్..!(వీడియో)

India vs New Zealand, 2nd Test: Ravindra Jadeja Takes An Indescribable Catch
India vs New Zealand,2nd Test : Ravindra Jadeja Takes A Stunning Catch To Dismiss Wagner!!

క్రైస్ట్‌చర్చ్‌: భారత జట్టులో రవీంద్ర జడేజా బెస్ట్ ఫీల్డర్ అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఈ విషయం మరోసారి రుజువైంది. అతని మైమరిపించే ఫీల్డింగ్.. అభిమానులను, ఆటగాళ్లను మరోసారి కనువిందు చేసింది. సూపర్ మ్యాన్‌ను తలపించేలా క్షణాల్లో గాల్లోకి ఎగిరి బంతినందుకోవడం.. అందరిని సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది.

సూపర్ మ్యాన్ తలపించేలా..

న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో మహ్మద్‌ షమీ వేసిన 72వ ఓవర్‌ చివరి బంతిని వాగ్నర్‌ స్వ్కెర్‌ లెగ్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు. ఆ బంతి బౌండరీ వెళ్లడం పక్కా అని అందరూ అనుకున్నారు. టీవీ కెమెరాలు కూడా బౌండరీ లైన్‌నే చూపించాయి. కానీ అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న జడేజా ఎవరూ ఊహించని విధంగా కళ్లు చెదిరే రీతిలో గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో బంతిని ఒడిసిపెట్టుకున్నాడు. రెప్పపాటులో చోటు చేసుకున్న ఈ అద్భుతానికి అందరూ అవాక్కయ్యారు. వాగ్నర్ అయితే పిచ్చోడిలా జడేజా చూస్తూ నిరాశగా పెవిలియన్ చేరాడు.

సూపర్ మ్యాన్ తలపించేలా..

న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో మహ్మద్‌ షమీ వేసిన 72వ ఓవర్‌ చివరి బంతిని వాగ్నర్‌ స్వ్కెర్‌ లెగ్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు. ఆ బంతి బౌండరీ వెళ్లడం పక్కా అని అందరూ అనుకున్నారు. టీవీ కెమెరాలు కూడా బౌండరీ లైన్‌నే చూపించాయి. కానీ అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న జడేజా ఎవరూ ఊహించని విధంగా కళ్లు చెదిరే రీతిలో గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో బంతిని ఒడిసిపెట్టుకున్నాడు. రెప్పపాటులో చోటు చేసుకున్న ఈ అద్భుతానికి అందరూ అవాక్కయ్యారు. వాగ్నర్ అయితే పిచ్చోడిలా జడేజా చూస్తూ నిరాశగా పెవిలియన్ చేరాడు.

సలాం.. జడ్డూ భాయ్..

పిచ్చెక్కించేలా ఉన్నా ఈ క్యాచ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.

‘జడ్డూ కాదు జాదు'అని ఒకరంటే.. ‘అతను మనిషి కాదు.. సూపర్‌ మ్యాన్‌ 'అంటూ ఇంకొకరు.. ‘సలాం జడ్డూ భాయ్‌' అని మరొకరు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఎమ్మెస్కే అన్నట్లు త్రీ డైమెన్షన్ ఆటగాడు ఎవడంటే అది జడేజానేని, బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు అద్భుతంగా ఫీల్డింగ్ చేయగలడంటూ కొనియాడుతున్నారు. ఇది ఆల్‌టైమ్ సూపర్ క్యాచ్ అని కూడా కొనియాడుతున్నారు.

హర్షాబోగ్లే ప్రశంసలు..

జడేజా పెర్ఫామెన్స్‌కు ముగ్ధుడైన ప్రముఖ వ్యాఖ్యత హర్షా బోగ్లే సైతం ట్విటర్ వేదికగా ప్రశంసల జల్లు కురిపించాడు.

‘రెండో రోజు ఆటలో జడేజా విభిన్న కోణాలను మనం చూశాం. తొలుత గ్రాండ్‌హోమ్‌ను బంతితో ఔట్‌ చేశాడు. అనంతరం వాట్లింగ్‌ను ఆ తర్వాత వాగ్నర్‌ను తన సూపర్‌ ఫీల్డింగ్‌తో వెనక్కి పంపాడు'అంటూ హర్ష భోగ్లే ట్వీట్‌ చేశాడు.

చెలరేగిన బుమ్రా, షమీ..

చెలరేగిన బుమ్రా, షమీ..

ఇక అంతకు ముందు తొలి ఇన్నింగ్స్ ఓవర్‌నైట్ స్కోర్ 63/0‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్.. మహ్మద్ షమీ (4/81), జస్‌ప్రీత్ బుమ్రా (3/62) ధాటికి 73.1 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా కోహ్లీసేన‌కు తొలి ఇన్నింగ్స్‌లో 7 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. న్యూజిలాండ్ జట్టులో టామ్ లాథమ్(52), జేమీసన్ (49), బ్లండెల్(30) టాప్ స్కోరర్లుగా నిలవగా.. విలియమ్సన్(3), రాస్ టేలర్(15), నికోలస్ (14) దారుణంగా విఫలమయ్యారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 89 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(3), పృథ్వీషా(14)తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ(14), పుజారా(24), రహానే (9), ఉమేశ్ యాదవ్(1) దారుణంగా విఫలమయ్యారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 242 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.

Story first published: Sunday, March 1, 2020, 11:46 [IST]
Other articles published on Mar 1, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+