పీఎం కేర్స్‌కు..
అనుబంధిత రాష్ట్రాలతో కలిసి పీఎం కేర్స్‌కు ఈ సాయం చేస్తున్నట్లు ప్రకటించింది. కొవిడ్-19 నుంచి భారతీయులను రక్షించడానికి, దేశంలో విపత్తు నిర్వహరణ సామర్థ్యాలను బలోపేతం చేయడంతోపాటు పరిశోధనలు ప్రోత్సహించడానికి విరాళం అందిస్తున్నట్లు తెలిపింది. ఆయా రాష్ట్రల అసోసియేషన్‌లు ఎప్పటికప్పుడూ పరిస్థితిని పర్యవేక్షిస్తాయని, ఈ మహమ్మారిపై పోరాడేందకు తమ ప్రభుత్వాలకు అండగా ఉంటాయని స్పష్టం చేసింది.

ప్రధానికి మద్దుతగా..
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి దేశమంతా ఐక్యంగా నిలుస్తుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా ట్వీట్ చేశారు. ఇక ఇప్పటికే దాదా వెస్ట్ బెంగాల్‌లోని అభాగ్యులకు అండగా.. రూ.50 లక్షల విరాళం ప్రకటించాడు. ఇతర క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ రూ.50 లక్షలు, సురేశ్ రైనా రూ.51 లక్షలు, శిఖర్ ధావన్ కొంత సాయం చేశారు. ఇక కోట్ల ఆదాయం ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ ఇంతవరకు ఎలాంటి సాయం ప్రకటించలేదు. దీంతో వారిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పేదలను ఆదుకోండి..
ఓ ఫండ్ రైజింగ్ సంస్థకు ధోనీ లక్ష విరాళం ప్రకటించగా.. దానిపై తీవ్ర దుమారం రేగింది. అయితే ఈ స్టార్ క్రికెటర్లకు పబ్లిసిటీ ఇష్టం ఉండదని, ఎంతో కొంత సాయం చేసి ఉంటారనే వాదన కూడా వినబడుతోంది. ఏది ఏమైనా ఈ విపత్కర పరిస్థితుల్లో సంపన్న వర్గాలు పేద ప్రజలను ఆదుకోవాల్సిందే. కరోనా మహమ్మారి ఏమో కానీ తిండిలేక చచ్చిపోయే పరిస్థితిలు మాత్రం తీసుకురావద్దని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












